Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 'దేశ్ కా నేత కేసిఆర్' ఫిల్మ్ ముహూర్తపు షాట్‌కు క్లాప్ కొట్టిన మంత్రి పువ్వాడ
నవతెలంగాణ- ఖమ్మం
తెలంగాణ ఉద్యమ నేత తెలంగాణ రాష్ట్ర స్వాప్నికుడు, తెలంగాణ జాతిపిత, దేశ్ కా నేత కేసిఆర్ టైటిల్‌తో డాక్యుమెంటరీ ఫిలిం ముహూర్తపు షాట్‌ను రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజరుకుమార్ ఆదివారం ఖమ్మంలోని క్లాప్ కొట్టి చిత్రీకరణను ప్రారంభించారు. దేశ రాజకీయాల్లో సీఎం కేసీఆర్ పాత్ర ఎలా ఉండబోతుంది.. కెసిఆర్ మార్కు ద్వారా దేశ వ్యాప్తంగా తెలంగాణ సంక్షేమ పథకాలను ఏ విధంగా అమలు జరపవచ్చు అనే కథాంశంతో ఖమ్మం జిల్లాకు చెందిన జర్నలిస్ట్ జానీ పాషా రూపొందిస్తున్న చిత్రం ఘన విజయం సాధించాలని మంత్రి పువ్వాడ అజరు కుమార్ ఆకాంక్షించారు. చిత్ర దర్శక నిర్మాత ఎస్.కె జానిపాషాను, చిత్ర యూనిట్‌ను మంత్రి పువ్వాడ ప్రత్యేకంగా అభినందించారు. కార్యక్రమంలో ఖమ్మం నగర మేయర్ పునుకొల్లు నీరజ, ఖమ్మం సుడా చైర్మెన్ బచ్చు విజయ్ కుమార్, చిత్రదర్శక, నిర్మాత ఎస్.కె . జానీపాషా (జర్నలిస్ట్), బిఆర్ఎస్ ముస్లీం మైనార్టీ ఖమ్మం జిల్లా అధ్యక్షులు మహమ్మద్ తాజుద్దీన్, ప్రచార కార్యదర్శి షేక్ షకీన, సీనియర్ నటులు లాల్ జాన్ పాషా, కోటయ్య, మంత్రిప్రగడ శ్రీనివాసరావు, ఎస్బీఐ బ్యాంక్ డిప్యూటీ మేనేజర్ యలమందల ప్రభాకర్, బిఆర్ఎస్ నాయకులు తాజుద్దీన్, చిత్ర నటీనటులు జ్యోతి, రేష్మా, పద్మ, మౌలానా, బాబా, జ్యోతి, శారద పద్మ, దుర్గ, పాషా, పునీత్ చౌదరి, భవ్య శ్రీ, తదితరులు పాల్గొన్నారు.