Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జూనియర్ పంచాయతీ కార్యదర్శులపై కనికరం లేని సర్కార్
- బీఎస్పీ ఆధ్వర్యంలో కొవ్వత్తుల ర్యాలీ
- బీఎస్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యెర్రా కామేష్
నవతెలంగాణ-కొత్తగూడెం
జూనియర్ పంచాయతీ కార్యదర్శి బైరీ సోనీది ముమ్మాటికీ తెలంగాణ సర్కారు చేసిన హత్యేనని బీఎస్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యెర్రా కామేష్ ఆరోపించారు. శనివారం బైరి సోనీ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ పట్టణంలో కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించి తెలంగాణ అమరవీరుల స్థూపం వద్ద నిరసన తెలిపారు. ఈ సందర్భంగా కామేష్ మాట్లాడుతూ వరంగల్ జిల్లా ఖానాపురం మండ లంలోని జూనియర్ పంచాయతీ కార్యదర్శి బైరీ సోని పంచాయతీ కార్యాలయంలో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న ఘటనలో రాష్ట్ర ప్రభుత్వానిదే బాధ్యతన్నారు. గత 15 రోజులుగా జూనియర్ పంచాయతీ కార్యదర్శులు తమ ఉద్యోగాన్ని రెగ్యులర్ చేయాలని, తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని ప్రభుత్వాన్ని కోరుతూ సమ్మెకు పూనుకున్నారని గుర్తు చేశారు. ఈ విషయంలో రాష్ట్ర ముఖ్య మంత్రి కేసీఆర్, పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు మొండిగా వ్యవహరించడం వలననే సోని మృతి చెందిందన్నారు.10 వేల మంది జూనియర్ పంచాయతీ కార్య దర్శిల జీవితాలతో ప్రభుత్వం చెలగాటం అడుతుందని మండిప డ్డారు. సోనీ మరణానికి రాష్ట్ర ప్రభు త్వమే పూర్తి బాధ్యత వహించాలని, ఆమె మృతికి కోటి రూపాయలు ఎక్స్ గ్రేషియా ప్రకటించాలని, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా సలహాదారు గంధం మల్లిఖార్జున రావు, చెనిగరపు నిరంజన్, సాయి, తాటిపాముల హరికృష్ణ, రాయరాకుల జగదీష్, శారద, లక్ష్మీ పాల్గొన్నారు.