Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- ఖమ్మం
ప్రభుత్వ స్థలాల్లో నివాసం ఏర్పరచుకున్న వారికి జీవో 58, 59 ద్వారా ప్రభుత్వం చేపట్టిన క్రమబద్దీకరణ ప్రక్రియను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ విపి.గౌతమ్ అన్నారు. శుక్రవారం కలెక్టర్ ఖమ్మం నగరంలోని జగ్జీవన్‌రామ్ నగర్లో పర్యటించి, క్షేత్రస్థాయిలో జిఓ 58, 59ల అమలుపై తనిఖీలు చేశారు. జీవో 59 కింద దరఖాస్తు చేసి, ప్రభుత్వం నుండి జారీచేసిన డిమాండ్ చెల్లించని, వారి ఇళ్లకు వెళ్లి డిమాండ్ చెల్లింపుపై అవగాహన కల్పించారు. దయానంద్, నర్సింహారావు, కృష్ణవేణి ఇళ్లకు వెళ్లి, ప్రభుత్వం మంచి అవకాశం ఇచ్చిందని, డిమాండ్ మొత్తం చెల్లించాలని, మొదట వెంటనే మొదటి వాయిదా చెల్లించాలన్నారు. చెల్లించని యెడల రెవిన్యూ రికవరీ యాక్ట్ ప్రకారం చర్యలుంటాయని కలెక్టర్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ స్థలాల్లో నివాసం ఏర్పరచుకొని 2 జూన్, 2020 నాటికి ఆక్రమణలో ఉన్నవారికి క్రమబద్దీకరణచేసి, పట్టాల పంపిణీకి ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. జిల్లాలో జీవో 58 క్రింద 3,253, జీవో 59 క్రింద 2,559 దరఖాస్తులను ఆమోదించినట్లు ఆయన తెలిపారు. ప్రభుత్వం కల్పించిన సదవకాశాన్ని సద్వినియోగం చేసుకొని, ఆక్రమణలో ఉన్న ప్రభుత్వ స్థలాలపై హక్కులు పొందాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఖమ్మం మునిసిపల్ కమిషనర్ ఆదర్శ్ సురభి, ఆర్డీవో రవీంద్రనాథ్, ఖమ్మంఅర్బన్ తహసీల్దార్ శైలజ, అధికారులు తదితరులు పాల్గొన్నారు.