Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కర్ణాటకలో కాంగ్రెస్ గెలుపు యావత్ దేశానికి శుభపరిణామం
- కాంగ్రెస్ శ్రేణులు విజయోత్సవాలు
నవతెలంగాణ-మణుగూరు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు పోధేం వీరయ్య ఆదేశాల మేరకు శనివారం మండలంలో అంబేద్కర్ కూడలిలో కర్ణాటకలో కాంగ్రెస్ గెలిచినందుకు బాణాసంచా కాల్చారు. స్వీట్ తినిపించుకొని కర్ణాటక సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అత్యధిక మెజార్టీతో ఘనవిజయం సాధించిందని పినపాక నియోజకవర్గం కోర్డినేటర్ కాటీబోయినా నాగేశ్వరరావు అధ్యక్షతన ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కర్ణాటకలో ఉన్న బిజెపి పాలనను ఈరోజు ప్రజలు తిరస్కరించారు. కర్ణాటకలో ఐదు సంవత్సరాల కాలంలో ప్రజలు ఓర్పుగా వ్యవహరించి సమయం కోసం ఎదురుచూసి బీజేపీని పాతాళానికి తొక్కడం జరిగిందన్నారు. అక్కడ కేసీఆర్, ఇక్కడ కాంతారావును కాంగ్రెస్ పార్టీ ఒడిస్తుందని తెలియజేసారు. ఈ కార్యక్రమంలో బీసీ సెల్ అధ్యక్షుడు కొత్తపల్లి సత్యనారాయణ, మండల ఉపాధ్యక్షులు కలబోయిన మాధవరావు, మైనార్టీ అధ్యక్షులు షేక్ లతీఫ్, మండల నాయకులు ఊకే వీరయ్య, లాలు, చింటూ, పటేల్, వెంకన్న, నాగరాజు, తదితరులు పాల్గొన్నారు.