Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కరకగూడెం
మండల పరిధిలోని చొప్పాల గ్రామపంచాయతీ పరిధిలో వట్టివాగు చెరువు నూతన నిర్మాణంలో భాగంగా భూమి కోల్పోయిన భూ నిర్వాసితులకు సుమారు 38 మందికి రూ.2కోట్ల 28లక్షలు 50వేలు చెక్కులను బుధవారం లబ్దిదారులకు ప్రభుత్వ విప్, పినపాక నియోజకవర్గ ఎమ్మెల్యే రేగా కాంతారావు చేతులమీదుగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ శేషగిరిరావు, సర్పంచ్ జవ్వాజి రాధ, ఎంపీపీ, జడ్పీటీసీ రేగా కాళిక, కొమరం కాంతారావు, వైస్ ఎంపీపీ పటాన్ ఆయూబ్ ఖాన్, ఎంపీటీసీ మునేంద్ర, తదితరులు పాల్గొన్నారు.