Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి కనకయ్య
నవతెలంగాణ-అశ్వారావుపేట
బీజేపీ ప్రతీ ఎన్నికల్లో ఏదో ఒక అబద్ధాలను, అసత్యాలను వాస్తవాలుగా తన ప్రచారాల్లో ప్రజల్లో జొప్పించి పదవిలోకి వస్తుందని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి అన్నవరపు కనకయ్య అన్నారు. ఆయన బుధవారం స్థానిక ప్రజా సంఘాల కార్యాలయం అయిన సుందర య్య భవన్లో నిర్వహించిన మండల కమిటీ సమావేశానికి హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన కార్యకర్తలనుద్దేశించి మాట్లాడుతూ... ప్రతీ ఎన్నికల్లోనూ మతపరమైన విషయాన్నో, లేక దైవ సంబంధమైన అంశాన్నో ప్రజల్లో జొప్పించి జాతీయతకు భిన్నంగా వ్యవహరిస్తున్నారని తెలిపారు. రాజ్యాంగ బద్దంగా పరిపాలన సాగిస్తానని ప్రతిజ్ఞ చేసి అప్రజాస్వామ్యకంగా వ్యవహరిస్తూ మతాల మధ్య చిచ్చు రేపుతున్నారని వాపోయారు. కమ్యూనిస్టులన్నా, సామాజిక చైతన్యపరులన్నా భాజపాకు భయం పట్టుకుందని అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కమిటీ కార్యవర్గం సభ్యులు కొక్కెరపాటి పుల్లయ్య, జిల్లా కమిటీ సభ్యులు పిట్టల అర్జున్, నాయకులు చిరంజీవి, గడ్డం సత్యనారాయణ, తగరం జగన్నాధంలు పాల్గొన్నారు.