Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఉద్యోగ విరమణ సన్మాన కార్యక్రమంలో మంద నర్సింహారావు
నవతెలంగాణ-మణుగూరు
వృత్తి, యూనియన్ని తమ రెండు కళ్లుగా భావించి, మచ్చలేని కార్మిక నేతగా నందం ఈశ్వరరావు అందరి మన్ననలు పొందారని సింగరేణి కాలరీస్ ఎంప్లా యిస్ యూనియన్ (సీఐటీయూ) రాష్ట్ర ప్రధాన కార్య దర్శి మందా నర్సింహారావు అన్నారు. బుధవారం స్థానిక కమ్యూనిటీ హాల్లో జరిగిన ఈశ్వరరావు సన్మాన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడు తూ... క్రమశిక్షణ కల్గిన కార్యకర్తగా అందరిలో మిన్నగా వుంటు, డబ్బు విషయంలో ఖచ్చితంగా వ్యవహరిస్తూ, బ్రాంచ్ కోశాధికారిగా, అన్ని రకాలుగా సేవలను నందం ఈశ్వరరావు చేశారన్నారు. ఈ ప్రాంతంలో అప్యాయతలు, ప్రజల మనస్సుల్లో స్థిరంగా నిలిచిన నందం ఈశ్వర్రావు మణుగూరు ప్రాంతంలో స్థిరపడి కార్మిక, ప్రజా ఉద్యమాలకు తమ సేవలను అందించాలని కోరారు. ఉదయం ఓసీ4 రిలే కార్మికులు గేట్ వద్ద నుండి నందం ఈశ్వరరా వును ఎత్తుకొని స్టేజి వద్ద దింపి తమ అభిమానాన్ని చాటుకున్నారు. సీవోసీ అన్నీ రంగాల కార్మికులు, అధికారులు అతన్ని ఘనంగా సన్మానించి, గొప్పత నాన్ని కొనియాడారు. అనంతరం ఓసీ4 మేనేజర్ డి.శ్రీనివాస్ మాట్లాడుతూ... నందం ఈశ్వరరావు నిబద్ధత కల్గిన నాయకుడని, పని విషయంలో అసాధ్యం కాని దానిని సాధ్యం చేసి చూపారన్నారు. ప్రణాళిక బద్ధంగా తమ జీవితాన్ని గడపాలని ఆయన ఆకాంక్షించారు. సీఐటీయూ నాయకులు ఆగయ్య, శ్రీనివాస్, సూర్య, సింగరేణి కాలరీస్ ఎంప్లాయిఎస్ యూనియన్ నాయకులు సన్మానించారు. ఈ కార్యక్ర మంలో సింగరేణి అధికారులు డేవిడ్, శంకర్, సీఐటీ యూ నాయకులు నెల్లూరి నాగేశ్వరరావు, వల్లూరి వెంకటరత్నం, కోడిశాల రాములు, పల్లే మల్లయ్య, టీవీఎంవి.ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.