Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రేషన్ షాపుల ద్వారా 16 రకాల సరుకులు అందజేయాలి
- దొంగ రేషన్ కార్డులు ఏరివేయాలి
- రౌండ్ టేబుల్ సమావేశం వ్యకాస జిల్లా కార్యదర్శి మచ్చ వెంకటేశ్వర్లు
నవతెలంగాణ-కొత్తగూడెం
అర్హులైన పేదలందరికీ రేషన్‌కార్డులు అందజేయాలని, రేషన్ షాపుల ద్వారా 16 రకాల నిత్యవసర వస్తువులు అందజేయాలని, తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి మచ్చా వెంకటేశ్వర్లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం వ్యకాస ఆద్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం ఆ సంఘం జిల్లా అధ్యక్షులు జాటోత్ కృష్ణ అధ్యక్షతనపై అంశాలపై రౌండ్ టేబుల్ సమావేశం కొత్తగూడెం సంఘం కార్యలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మట్లాడుతూ జిల్లాలో 283273 రేషన్ కార్డుల ద్వారా 832612 మందికి లబ్దిచేరుకుతుందని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ పేదలుగా ఉన్న వారికి నష్టం జరుగుతుందని అవేదన వ్యక్తం చేసారు. దొంగ రేషన్ కార్డులను ఏరివేసి ఆర్హులైన పేలందరికీ రేషన్ కార్డులు ఇచ్చి 16 రకాల నిత్యవసర సరుకులను చౌక దుకాణాల ద్వారా సరఫరా చేయాలని కోరారు. రేషన్ కార్డులు ఆధార్‌కు లింకు అనే పేరుతో మీసేవ కేంద్రాల చుట్టు పేదలను పద్ధతికి ప్రభుత్వం స్వస్థి పలకాలని కోరారు. ఈ సందర్భంగా రాతపూర్వక నివేదికను ప్రవేశపెట్టారు. గత 2 సంవత్స రాలుగా కరోనా బారీన పడి, పనులు కోల్పోయిన పేదలు, వలస కార్మికులు కొత్తగా కుటుంబం నుండి వేరు పడిన వారి కి రేషన్ కార్డులు లేక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. రేషన్ కార్డుపై మనిషికి నెలకు 10కిలోల బియ్యం, 2కిలోల పప్పు, 6 లీటర్ల గ్యాస్ నూనే, కిలో పంచాదార, కిలో వంట నూనె, ప్రతి నెల ఇవ్వాలన్నారు. పింఛన్ కార్డులు ఉన్న వారికి కూడా కార్డు రద్దు చేసిన సంఘటనలు ఉన్నాయ న్నారు. కేంద్రం ప్రభుత్వం 53.30లక్షల కార్డులు మాత్రమే గుర్తించింది. రాష్ట్ర ప్రభుత్వం 34.25లక్షల కార్డులు ఇచ్చిం ది. రీ-సర్వే చేసి అర్హులందరికీ కేంద్రం నుండి కార్డులు వచ్చే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. ముఖ్యగా అన్ని వ్యాధులకు ''ఆరోగ్యశ్రీ'' వర్తింప చేయాలన్నారు. 'పోషణ్ అభియాన్ పథకం'కు నిధులు లేవన్నారు. ఈ సమా వేశంలో పాల్గొన్న ప్రజా సంఘాల నాయకులు సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు కొండపల్లి శ్రీధర్, రైతు సంఘం జిల్లా నాయకులు వాంకుడోత్ కోబల్, వ్యకాస నాయకులు సుధీర్, ఆదివాసీ సంఘాల జేఏసి కన్వీనర్ రామకృష్ణ దొర, సీఐటీయూ నాయకులు సత్యనారాయణ, నాగేశ్వరరావు, ఐద్వా నాయకులు ఎస్.లక్ష్మీ, కె.సత్య, కెవిపిఎస్ నాయకులు ఆనంద్, వెంకటయ్య, ఆవాజ్ నాయకులు యండి.జలాల్, అలీమ్, సలీం తదితరులు పాల్గొన్నారు.
రౌండ్ టేబుల్ సమావేశంలో పలు డిమాండ్స్
అర్హులందరికీ రేషన్ కార్డులు ఇవ్వాలి. అందుకు రీ-కుటుంబ సర్వే ప్రాంతీయంగా చేపట్టాలి. ఆధారు కార్డుతో సంబందం లేకుండా రేషన్ కార్డు ఇవ్వాలి. లేదా ఆదార్ కార్డు కూడ వెంటనే ఇవ్వాలి. ఈసేవ, మీసేవ కేంద్రాలు పెట్టకుండా ప్రత్యేక సిబ్బందిని నియమించి కుటుంబాలకు కార్డులు అందించాలి. ప్రతి 600 కుటుంబాలకు ఒక చౌక డిపో ఏర్పాటు చేయాలి. బియ్యంతో పాటు 23 రకాల నిత్యవసర సరుకులను సబ్సడీపై నాన్యమైనవి సరఫరా చేయాలి. గ్రామ, మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిలో కమిటీలు వేయాలి. ఈ కమిటీలలో మహిళలు, ప్రజా సంఘాల నాయకులు ఉండాలి. సన్న బియ్యం సరఫరా చేయాలి. ప్రభ్వుతమే చౌక డిపోల వరకు రవాణ చార్టీలు భరించాలి. వ్యవసాయ రంగాన్ని ధ్వంసం చేసే, ఆహార భద్రతను దెబ్బతీసే చట్టాలను రద్దు చేయాలి. ప్రజా పంపిణీ వ్యవస్థను రద్దు చేసి నిత్యవసర సరుకుల ధరలను పెంచే కార్పొరేట్ వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలి.