Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గ్రూప్ ఏ, బీలలో గోల్డ్ మెడల్స్ సాధించిన మానస, ప్రవలిక
నవతెలంగాణ-ఇల్లందు
గోవా రాష్ట్రంలో మార్చ్ 28, 29వ తేదీల్లో 2021 సంవత్సరానికి గాను జరిగిన ఏషియా లెవల్ అంతర్జాతీయ కరాటే ఛాంపియన్ షిప్ పోటీల్లో ఇల్లందుకు చెందిన విద్యార్థినీలు గోల్డ్ మెడల్ సాధించారు. సీనియర్ గ్రూప్ ఏ విభాగంలో మానస ఫస్ట్ ప్లేస్ గోల్డ్ మెడల్, గ్రూఫ్ ఏ విభాగంలో వి.ప్రవళిక గోల్డ్ మెడల్ ఫస్ట్ ప్లేస్ సాధించారు. వీరు బాంగ్లాదేశ్, శ్రీలంకకు చెందిన కరాటే ఛాంపియన్స్‌తో పోరాడి విజేతలుగా మొదటి స్థానంలో నిలిచి బంగారం పధకం సాధింఛడంతో (గోవా) పోటీ మైదాన ప్రాంగణంమంతా జిల్లా, ఇల్లందు పేరు మారుమోగిపోయింది. వీరిద్దరూ అంతర్జాతీయా స్థాయిలో గోల్డ్ మెడల్ గెలవడం వరుసగా ఇది మూడవ సారి. ఈ సారి కూడా అంతర్జాతీయ స్థాయిలో గోల్డ్ మోడల్స్ సాధించటం పట్ల వీరి కోచ్, కరాటే అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు మాస్టర్క్లింట్ రోచ్ అయినందుకు ఎంతో గర్వంగా ఉందని పేర్కొంటున్నారు. ప్రతీ మండల కేంద్రంలో కరాటే శిక్షణా శిబిరాలు ఏర్పాటు చేసేలా స్థానిక ప్రజాప్రతినిధులు రాష్ట్ర ప్రభుత్వానికి సూచించాలని క్లింట్ రోచ్ విజ్ఞప్తి చేసారు. ఈ గోవా కరాటే పోటీలకు ఎఫ్ఎస్ఎస్కేఏఐ జిల్లా అసోసియేషన్ సెక్రెటరీ పెనుగొండ సదానందం, టెక్నికల్ డైరెక్టర్ సీహెచ్.ఉష రాణి, ఆర్గనైజింగ్ సెక్రటరీ మరియమ్మ, గోల్డ్ శంకర్, జగన్నాథం, విష్ణు లతా, తదితరులు పాల్గొన్నారు. బంగారు పథకం గెలిచినందుకు విద్యార్థుల తల్లిదండ్రులు క్రీడా సంఘాలు, సపోర్టర్స్ ఆర్ఐ, జిల్లా అసోసియేషన్ చైర్మెన్ సీఐ దామోదర్ వారిని అభినందించారు.