Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విలువ రూ.29.70 లక్షలు
- ముగ్గురు అరెస్టు, వాహనాలు సీజ్
నవతెలంగాణ-భద్రాచలం
భద్రాచలంలో అటవీ చెక్ పోస్టు వద్ద పోలీసులు వాహన తనిఖీలు చేపట్టగా వాహనాల్లో తరలిస్తున్న 198 కేజీల గంజాయిని పట్టుకు న్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను భద్రాచలం ఏఎస్పీ డాక్టర్ జి.వినీత్ వెల్లడించారు. భద్రాచలం అటవీ చెక్ పోస్ట్ వద్ద భద్రాచలం పట్టణ సీఐ టీ.స్వామి ఆధ్వర్యంలో పట్టణ ఎస్ఐ వి.వెంకటేశ్వరరావు, ప్రొబీషనరీ ఎస్సై రాము బుధవారం వాహన తనిఖీలు చేపట్టారు. ఈ సమయంలో ఒక బ్రిజా యం.హెచ్ 12 ఆర్ టి 0887, ఒక స్కోడా కారు ఏపీ 24 ఎయం.0008 వాహనాల్లో ముగ్గురు వ్యక్తులు అనుమానాస్పదంగా ఉండటాన్ని పోలీసులు గమనించారు. ఈ సమయంలో పోలీసులు ఈ రెండు వాహనాల్లో తనిఖీలు నిర్వహించారు. వీటిలో గంజాయి ఉండటాన్ని పోలీసులు గమనించారు. 198 కేజీల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ రూ.29.70 లక్షలు ఉంటుందని పోలీసులు పేర్కొన్నారు. అయితే మహారాష్ట్ర, పూణేకి చెందిన యువరాజ్ శంకర్ దిగ్దే, అనిల్ కాంబ్లీ, దత్తాత్రేయ శివాజీ మాటేలు ఈ గంజాయిని ఒడిస్సా ప్రాంతం నుంచి మహారాష్ట్ర, పుణికి తరలిస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. ఈ మేరకు రెండు వాహనాలు సీజ్ చేసి, ముగ్గురిని అరెస్ట్ చేసి కోర్టుకు తరలించారు. ఈ కార్యక్రమంలో పట్టణ సీఐ టి.స్వామి, పట్టణ ఎస్సై వి.వెంకటేశ్వరరావు, ప్రొబెషనరీ ఎస్సై రాము, పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.