Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కొత్తగూడెం
కొత్తగూడెం సింగరేణి గౌతమ్గని ఓపెన్ కాస్ట్ కోల్ హ్యంఢింగ్ ప్లాంట్లో సేల్ పీకింగ్ కాంట్రాక్టు కార్మికునిగా పనిచేస్తున్న ముక్కేర రాజయ్య బుధవారం మృతి చెందాడు. ఉదయం అకస్మాత్తుగా ఛాతిలో నొప్పి రావడంతో సింగరేణి మెయిన్ హాస్పిటల్కి తరలించారు. ఆసుపత్రిలో అడ్మిట్ చేయగా వైద్య పరీక్షలు చేసిన డాక్టర్లు ఇక్కడ సరైన డాక్టర్ లేరని, తక్షణమే ఖమ్మం, హైదరాబాద్ తరలించాలని సూచించారు.. వైద్యం చేసి ఖమ్మం మమత హాస్పిటల్కి తీసుకు వెళ్లే ప్రయత్నం చేస్తున్న క్రమంలో రాజయ్యకు గుండెపోటు తీవ్రంగా వచ్చి మధ్యాహ్నం 4 గంటలకు సింగరేణి మెయిన్ హాస్పిటల్లో అకస్మాత్తుగా మరణించాడు. ఈ విషయం తెలుసుకున్న తోటి కార్మికులు, వివిధ కార్మిక సంఘాల నాయకులు హాస్పటల్లో మృతదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సీఐటీయూ అనుబంధ సింగరేణి కాంట్రాక్టు కార్మికుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు యర్రగాని కృష్ణయ్య మాట్లాడుతూ... ఎంతో పేరు ప్రతిష్టలు ఉన్న సింగరేణి మెయిన్ హాస్పిటల్లో సరైన స్పెషలిస్టు లేరని దీని మూలంగా అనేక మంది కార్మికులు సకాలంలో సరైన వైద్యం అందక మరణిస్తున్నారన్నారు. సింగరేణి యాజమాన్యం పూర్తి బాధ్యత వహించాలని ఆయన డిమాండ్ చేశారు. మృతుని కుటుంబాన్ని ఆదుకోవాల్సన బాధ్యత సింగరేణి యాజమాన్యందేనని కృష్ణయ్య ఉద్ఘాటించారు. సింగరేణి యాజమాన్యం ప్రధాన ఆసుపత్రిలో అవసరమైన స్పెషలిస్ట్ డాక్టర్స్ నియమకానికి తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.