Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎంప్లాయిస్ అసోసియోషన్ అధ్యక్షుడు కేశవరావు
- ఎన్నికల అధికారులు చర్యలు చేపట్టాలని వేడుకోలు
నవతెలంగాణ-అశ్వాపురం
ఇటీవల 2021 జనవరి 27న భారజల సహాకార సంఘానికి జరిగిన ఎన్నికలలో వరుసగా మూడోసారి ఎన్నికైన కాళంగి గురవయ్య ఎన్నిక సొసైటీ నిబందలనకు విరుద్ధమని భారజల ఎంప్లాయిస్ అసోసియోషన్ అధ్యక్షుడు పాడ్య కేశవరావు అన్నారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. సొసైటీ ఏర్పడినప్పుడు రాసుకున్న బైలాస్ (5బి) ప్రకారం ఒకే వ్యక్తి వరుసగా రెండు పర్యాయాలు ఎన్నికై కార్యవర్గంలో చోటు సంపాదించేందుకు అర్హూడు అనే నిబందన ఉంది. కానీ సదరు గురవయ్య సొసైటీ నిబందనల ప్రకారం రెండు సార్లు గెలుపొంది అధ్యక్షుడుగా భాద్యతలు నిర్వహించాడు. అయితే నియమావాలి ప్రకారం మూడోసారి ఆయన పోటీ చేయకూడదని నిబందనలో ఉన్నప్పటికీ ఎన్నికల అధికారుల కళ్ళుగప్పి వరుసగా మూడోసారి కూడా సొసైటీ ఎన్నికలలో పోటిచేసి గెలుపొంది. కార్యవర్గాన్ని ఏర్పాటు చేసుకుని అధ్యక్షుడిగా అందలమెక్కాడన్నారు. ఇది సొసైటీ నిబందనలకు పూర్తిగా విద్దమైనప్పటికీ వీటిని ఎవ్వరూ గమనించకపోవడంతో గుర్తింపు సంఘంగా వారు రాజ్యమేలుతున్నారు. ఇది ముమ్మాటికీ భారజల ఎంప్లాయిస్ సొసైటీని మోసం చేయడమే అవుతుందని ఆయన అన్నారు. ఈ విషయం ఇప్పటివరకు ఎవరికీ తెలియకుండా జాగ్రత పడిన సదరు కార్యవర్గం ఈ నెల 21న మహాజన సభ నిర్వహించి గతంలో ఏర్పచుకున్న నిబందనలను గుట్టు చప్పుడు కాకుండా దొడ్డిదారిన మార్చేందుకు పూనుకున్నారు. దీన్ని గమనించిన సభ్యులు ఆనోట ఈనోట పడి బహిర్గతమైంది. దీంతో ఇప్పుడు సొసైటీ భారజాలను ఎలా మార్చి పానల చేస్తాడని సొసైటీలోని సభ్యులు అంటున్నారు. ఇప్పటికైనా ఎన్నికల అధికారులు స్పందించి సొసైటీ నియమావళిని ఉల్లంగించిన వారిపై చర్యలు చేపట్టి సొసైటీ అధ్యక్షుడిపై విచారణ చేపట్టి నిబందనల ప్రకారం చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.
ఇది ముమ్మాటికీ ఉద్యోగులను మోసం చేయడమే : ఎంప్లాయిస్ అసోసియోషన్ అధ్యక్షుడు పాడ్య కేశవరావు
సొసైటీ నిబందలన ప్రకారం ఒకే వ్యక్తి వరుసగా రెండు సార్లు మాత్రమే కార్యవర్గంలో కొనసాగాలి. కానీ ఇప్పుడున్న గురవయ్య వరుసగా మూడోసారి కార్యవర్గంలో కొనసాగడం నిబందనలకు విరుద్ధం. ఎన్నికల అధికారులు దీన్ని పరిగణలోకి తీసుకుని ఆయన ఎన్నికను రద్దుచేయాలి