Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సర్వసభ్య సమావేశంలో ఎంపీటీసీలు ఆగ్రహం
నవతెలంగాణ-కల్లూరు
కల్లూరు రెవెన్యూ డివిజన్ ప్రకటించిన దగ్గర్నుండి కల్లూరుకు మంజూరైన కార్యాలయాలు పథకాలు ఇతర మండలాలకు తరలిపోతున్న ప్రజాప్రతినిధులు గానీ అధికారులు గానీ పట్టించుకోరా అంటూ ఎంపీటీసీలు ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం మండల పరిషత్ సర్వసభ్య సమావేశం ఎంపీపీ బీరవల్లి రఘు అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశాల్లో ఎంపీటీసీలు కొండూరి కిరణ్ కుమార్, ఉప్పు సుబ్బారావు, హస్కే కమ్లి తదితరులు మాట్లాడుతూ ఇటీవల కల్లూరు ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే ఉచితంగా పరీక్షలు చేసేందుకు ల్యాబోరేటరీ మంజూరు కాగా ఈ కేంద్రాన్ని సత్తుపల్లి తరలించి అక్కడ ప్రారంభించడమేమిటని ప్రశ్నించారు. గతంలో కూడా ట్రెజరీ కల్లూరుకు మంజూరుకాగా వైరాకు తరలించారు. సమావేశానికి రెవెన్యూ, ఆర్అండ్బీ శాఖల అధికారులు హాజరు కాకపోవటంతో యజ్ఞనారాయణ పురం సర్పంచ్ రావి సూర్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకునేందుకు ప్రజలు భయపడు తున్నారని అవగాహన పెంచాలని ఎంపీపీ బీరవల్లి రఘు అన్నారు. కార్యక్ర మంలో ఎండీవో మహాలక్ష్మి, జడ్పీ కోఆప్షన్ సభ్యులు ఎండీఇస్మాయిల్, పలు శాఖల అధికారులు ఎంపీటీసీలు సర్పంచులు కోఆప్షన్ సభ్యులు పాల్గొన్నారు.