Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సింగరాయపాలెంలో ఆకస్మికంగా సందర్శించిన జడ్పీ సీఈఓ
నవతెలంగాణ-కొణిజర్ల
మండల పరిధిలోని సింగరాయపాలెం గ్రామ పంచాయతీ పాలకవర్గ పనితీరు అమోఘమని జడ్పీ సీఈఓ ప్రియాంక అన్నారు. బుధవారం ఆమె గ్రామాన్ని ఆకస్మికంగా పరిశీలించారు. ముందుగా ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సైన్స్ ల్యాబ్ రూమ్‌ను పరిశీలించారు. పాఠశాలలో కంప్యూటర్లు పనిచేస్తున్నాయా లేదా విద్యార్థులు ఎంతమంది ఉన్నారని ప్రధానోపాధ్యాయులు శ్యాంసన్ ని అడిగి తెలుసుకున్నారు. అనంతరం నర్సరీని సందర్శించి నర్సరీ నిర్వహణ బాగుందన్నారు. డంపింగ్ యార్డు సందర్శించి పనులు సూచనలు చేశారు. నాటిన మొక్కలు బతికే ఉన్నాయా లేదా అని అడిగి తెలుసుకున్నారు. తర్వాత పంచాయతీ కార్యాలయంలోకి వచ్చి పంచాయతీ కార్యదర్శితో మాట్లాడుతూ గ్రామ పంచాయతీలో మొత్తం ఎన్ని రికార్డులు ఉన్నాయి. రికార్డులు మెయింటైన్ సక్రమంగా చేస్తున్నారా లేదా డెత్, బర్త్, కళ్యాణ లక్ష్మికి, సంబంధించిన రికార్డులు పరిశీలించారు. గ్రామపంచాయతీకి సంబంధించిన ప్రతిది ఆన్లైన్ చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో ఆర్ రమాదేవి, పంచాయతీ కార్యదర్శి ఎస్ రామకృష్ణ, సర్పంచ్ దోడ్డపనేని జ్యోతి, ఎంపీటీసీ అనుమోలు క్రిష్ణార్జున్ రావు, దొడ్డపనేని క్రిష్ణార్జున్ రావు పాల్గొన్నారు.