Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- ఖమ్మం
ఖమ్మం నగరంలో వ్యభిచారం నిర్వహిస్తున్న ముఠాను ఖమ్మం టూ టౌన్ పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. స్థానిక భక్తరామదాసు కళాక్షేత్రం సమీపంలో ఒక గదిని అద్దెకు తీసుకొని ఓ మహిళ అక్కడకు ఇతర ప్రాంతాల నుంచి యువతులను తీసుకొచ్చి విటులను రప్పించి వ్యభిచార కార్యకలాపాలు నిర్వహిస్తోందనే సమాచారం అందుకున్న టూ టౌన్ సిఐ తుమ్మ గోపి తన సిబ్బందితో కలిసి బుధవారం దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో నలుగురు మహిళలు, ఒక విటుడు పట్టుబడ్డాడు. దీంతో వారిని స్టేషన్కు తరలించి కేసు నమోదు చేశారు.