Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఉద్యమపోరాట సమితి జిల్లా అధ్యక్షులు నర్సయ్య ముదిరాజ్
నవతెలంగాణ-పాల్వంచ
1969 ఉధ్యమకారులకు పెన్షన్ ప్రకటించాలని తెలంగాణ ఉద్యమ పోరాట సమితి జిల్లా అధ్యక్షులు శ్రావణబోయిన నర్సయ్య ముదిరాజ్ ముఖ్యమంత్రిని కోరారు. ఈ మేరకు ముఖ్యమంత్రికి వినతిపత్రం అందజ ేశారు. ఈ సందర్భంగా పాల్వంచలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ... 1969 నుండి 2014 వరకు తొలి, మలి ఉధ్యమంలో రెండు దశల్లో తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అలుపెరుగని పోరాటం చేసి అహర్నిషలు శ్రమించి లాఠీ దెబ్బలకు ఎదురొడ్డి పోరాడామన్నారు. కేసీఆర్ నాయకత్వాన్ని బలపరిచి రాష్ట్ర సాధనలో భాగస్వాములమై మావంతు ఎంతగానో కృషి చేశామని అన్నారు. పాల్వంచలో కేటీపీఎస్‌లో ఉధ్యమం ప్రారంభం అయి కొత్తగూడెంలో అగ్నిగుండం అయి తుపాకీ తూటాలకు రాంచందర్, దస్తగిరి ప్రాణాలు కోల్పోగా 369 మంది విద్యార్థుల ప్రాణాలు గాల్లో కలిసాయని చెప్పారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఉధ్యమకారులందరికీ పెన్షన్ మంజూరు చేయాలని కోరారు