Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కొత్తగూడెం
కరోనా వ్యాధి నియంత్రణ చర్యల్లో భాగంగా మాస్క్ వినియోగించని వ్యక్తులకు జరిమానా విధించాలని కలెక్టర్ ఎంవి.రెడ్డి అధికారులను ఆదేశించారు. బుధవారం కరోనా వ్యాధి నియంత్రణ చర్యలు, ధాన్యం కొనుగోళ్లు, అగ్ని ప్రమాదాలు నివారణ చర్యలు, ప్రమాదాల నివారణ చర్యలు తదితర అంశాలపై వైద్య, రవాణా, ఆర్ అండ్ బి, రెవెన్యూ, పంచాయతీ తదితర శాఖల అధికారులతో వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు. ముఖ్యంగా ఈ సీజన్లో విద్యార్థులు కళాశాలలు, పాఠశాలలు నిర్వహణ లేక పోవడం వల్ల కాలువలు, చెరువులు, గోదావరిలో ఈ తకు వెళ్లి ప్రమాద వశాత్తు మరణిస్తూ కుటుంబాలకు తీరని వేదనను మిగుల్చుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రమాదాల నివారణకు గ్రామ, మండల, జిల్లా స్థాయి అధికారులు చర్యలు చేపట్టాలని చెప్పారు. కరోనా వ్యాది నియంత్రణ చర్యల్లో భాగంగా ఫంక్షన్ హాళ్లపై ప్రత్యేక నిఘా కొనసాగాలని చెప్పారు.
50 మంది కంటే ఎక్కువ ఉంటే కరోనా వ్యాధి నియంత్రణ చర్యలు చట్ట ప్రకారం పోలీస్ కేసులు నమోదు చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు వెంకటేశ్వర్లు, అనుదీప్, డీఆర్ఓ అశోక్ చక్రవర్తి, డీఆర్డిఓ మధుసూదన్ రాజు, డీపీఓ రమాకాంత్, వ్యవసాయ అధికారి అభిమన్యుడు, సహాకార అధికారి మైకేల్ బోస్, పౌర సరఫరాల అధికారి చంద్రప్రకాశ్, తహసీల్దారులు తదితరులు పాల్గొన్నారు.