Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వార్షిక ఉత్పత్తిలో వెనుకబాటు
- విలేకరుల సమావేశంలో ఏరియా జీఎం నరసింహారావు
నవతెలంగాణ-కొత్తగూడెం
కొత్తగూడెం సింగరేణి రుద్రంపూర్ ఏరియాలో అనుకున్న బొగ్గు ఉత్పత్తి లక్ష్యాన్ని అధిగమించడంలో వెనుక పడినప్పటికి మిగతా ఏరియాల కంటే అత్యధికంగా బొగ్గు ఉత్పత్తి చేసి, అధికంగా బొగ్గు రవాణా చేసి రికార్డు నెలకొల్పిందని ఏరియా జనరల్ మేనేజర్ సిహెచ్.నరసింహారావు వెల్లడించారు. బుధవారం జీఎం కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన ఉత్పత్తి లక్ష్యానికి సంబంధించిన వివరాలను వెల్లడించారు. మార్చి మాసాంతానికి ఏరియా లక్ష్యం 13.55 కాగా, 11.70 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి చేసి 86 శాతం నమోదు చేయడం జరిగిందని తెలిపారు.2020-21 వార్షిక బొగ్గు ఉత్పత్తి లక్ష్యం కొత్తగూడెం ఏరియాకు 145.50 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి చేయాల్సి ఉండగా, 93.74 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి చేసి కేవలం 64 శాతం నమోదు చేయడం జరిగిందని చెప్పారు. మార్చి నెలలో కొత్తగూడెం ఏరియా 93.74 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి చేసి, అదే స్థాయిలో 93.74 లక్షల టన్నుల బొగ్గును రోడ్డు, రైలు మార్గాల ద్వారా వినియోగదారులకి చేరవేసిన నట్లు తెలిపారు. మార్చి మాసాంతానికి కొత్తగూడెం పరిధిలో ఉన్న జీకే ఓపెన్ కాస్ట్, సత్తుపల్లి జేవిఆర్-ఓసిల ద్వారా 13 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యం కాగా 11.58 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి చేసి 89 శాతం నమోదు చేయడం జరిగిందని చెప్పారు. వార్షిక ప్రగతిలో ఓపెన్ కాస్ట్‌ల నుండి 138 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి చేయాల్సి ఉండగా 89.81 లక్షల టన్నుల బొగ్గును వెలికి తీయడం జరిగిందన్నారు. ఓపెన్ కాస్ట్ నుండి 65 శాతం వార్షిక లక్ష్యంలో బొగ్గు ఉత్పత్తి చేశామని వివరించారు. సింగరేణి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సోలార్ విద్యుత్ ఉత్పత్తి మే-జూన్ నెల నాటికి పూర్తిస్థాయిలోకి వస్తుందని తెలిపారు. సోలార్ 37 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి ఏర్పాటు చేశామని తెలిపారు. సత్తుపల్లి జేవిఆర్-ఓసీ ప్రాంతంలో నిర్మిస్తున్న సింగరేణి కార్మిక నివాస గృహాల పనులు వేగవంతంగా జరుగుతున్నాయని, ఇప్పటికే కొన్ని ఇండ్లు పూర్తి కాగ, 14 బ్లాకులు చొప్పున సిద్ధమ య్యారని, ఇందులో 74 పూర్తి స్థాయి సౌకర్యాలతో సిద్దం కానున్నట్లు తెలిపారు. ఈ విలేక్ల సమావేశంలో కొత్తగూడెం ఏరియా ఎస్ఓటు జిఎం నారాయణ రావు, ఏరియా ఇంజనీర్ రఘు రామరెడ్డి, డిజిఎం పర్సనల్ సామ్యూల్ సుధాకర్, ఏజెంట్ రవీందర్, డిజిఎం ఐఈ ఉజ్వల్ కుమార్ బెహ్రా, డిజిఎం సివిల్ సూర్యనా రాయణ, డిజిఎం ఫైనాన్స్ టి.రాజ శేఖర్, డివైపియు మ్ బుచ్చయ్య, ఇతర అధికారులు పాల్గొన్నారు.