Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విజేఏసీ చైర్మన్, టీవీపీఎస్ అధ్యక్షులు సతీష్ గుండపునేని
నవతెలంగాణ-పాల్వంచ
పైశాచిక ఆనందాన్ని అనుభవిస్తున్న నవభారత యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని విజేఏసీ చైర్మన్ మరియు టివిపిఎస్ అధ్యక్షులు సతీష్ అన్నారు. గత జులై 18 పాల్వంచ నవభారత్ కర్మాగారంలో యఫ్.బి యార్డ్ బీసీ 3 ఏరియాలో పనిచేస్తున్న గంగ బోయిన ఉపేందర్ కన్వేయర్ బెల్టులో ప్రమాదవశాత్తు కుడి చేయి తెగిపోయింది. వైద్యుల సలహా మేరకు ఇంట్లోనే ఉండి, గాయం నుంచి కోలుకుని అనేక పోరాటాల తర్వాత నవభారత యాజమాన్యం స్పందించి ఉపేందర్‌కు న్యాయం చేస్తానని మాట ఇచ్చి ఆరు నెలలు గడుస్తున్నా ఇంత వరకు ఎటువంటి స్పందన లేకపోవడంతో గత ఎనిమిది రోజులుగా నవభారత్ కర్మాగారం గేట్ ముందు కుటుంబంతో దీక్ష చేస్తున్న ఉపేందర్‌కు బుధవారం టీవీపీఎస్ సభ్యులు మద్దతుగా నిలిచారు. ఈ సందర్భంగా సంఘ వ్యవస్థాపక అధ్యక్షుడు సతీష్ గుండపునేని మాట్లాడుతూ గత ఎనిమిది రోజులుగా రోజులుగా శాంతియుతంగా దీక్ష చేస్తున్నా ఉపేందర్‌ను యజమాన్యం టెంటు కూడా వేయనీకున్న ఎండలోనే కుటుంబ సభ్యులతో దీక్ష చేస్తున్నప్పటికీ, దీక్ష ఎవరికీ కనబడకుండా అంబులెన్స్ ను తీసుకొచ్చి అడ్డుపెట్టడం, రాత్రిపూట స్ట్రీట్ లైట్ సైతం బంద్ చేసి నవభారత్ యాజమాన్యం పైశాచిక ఆనందాన్ని అనుభవిస్తున్నారని వారు దీక్షను ఎలా భగం చేయాలన్నది మానుకొని హెచ్చరించారు. అతనికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో విజేఏసి జిల్లా కన్వీనర్ నాగేశ్వరరావు, టివిపి ఎస్ ఉపాధ్యక్షులు ఖాదర్ బాబా, పాల్వంచ అధ్యక్షుడు నయీమ్, టివిపిఎస్ సభ్యులు చాంద్ పాషా, హుస్సేన్ మియా పాల్గొన్నారు.