Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తెలంగాణ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు బొంతు రాంబాబు
నవతెలంగాణ-వైరా టౌన్
రాష్ట్ర ప్రభుత్వం మొక్కజొన్నలను రైతులు దగ్గర నుంచి కొనుగోలు చేయాలని తెలంగాణ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు బొంతు రాంబాబు డిమాండ్ చేశారు. బుధవారం వైరా మండలంలోని రైతుల మొక్కజొన్న కల్లాలను తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో పరిశీలించారు. ఈ సందర్భంగా తెలంగాణ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు బొంతు రాంబాబు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయకపోవడంతో రైతులు క్వింటాకు రూ.400 నష్టపోతున్నారని అన్నారు. వెంటనే ప్రభుత్వం మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. కరోనా విజృంభణ వల్ల రైతులు మరింతగా నష్టపోయే అవకాశం ఉందని రైతులను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా నాయకులు తోట నాగేశ్వరావు, రైతులు పాల్గొన్నారు.