Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మారుమూల ప్రాంతాలకు రోడ్ల విస్తరణ
నవతెలంగాణ-కొత్తగూడెం
కొత్తగూడెం నియోజకవర్గంలో పోడు భూములు సమస్య పరిష్కారంకు రాష్ట్ర ముఖ్య మంత్రి కె.చంద్రశేఖర్‌రావు జిల్లా పర్యటనలో పరిష్కరిస్తారని, అప్పటి వరకు అధికారులు సమయంమనం పాటించాలని, ఏజన్సీ మారుమూల ప్రాంతాలకు రోడ్ల విస్తరణ చేపట్టనున్నట్లు కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు అన్నారు. శుక్రవారం పొడు భూములు, మారుమూల గ్రామాల్లో రోడ్లు విస్తరణ, ఇతర సమస్యలపై ఫారెస్ట్ అధికారులు డిఎఫ్ఓ, ఎఫ్డిఓ, ఆర్ అండ్బి, మున్సిపల్ అధికారు లతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. పోడు భూముల సమస్యను ముఖ్యమంత్రి జిల్లా పర్యటనకు వచ్చే వరకు పోడు రైతులను ఇబ్బంబందులకు గురిచేయరాదన్నారు. పోడు భూములలో ఫారెస్ట్ అధికారులు ట్రెంచ్‌లు నిలిపివేయాలన్నారు. లక్ష్మీదేవిపల్లి మండలంలోని రేగళ్ళ, గట్టుమల్ల, బంగారు చెలక, మైలారం, ఊల్వనూరు, కిన్నెరసాని, రాజాపురం వరకు రోడ్డుకు ముఖ్యమంత్రి కెసిఆర్ రూ.45 కోట్లు మంజూరు చేసినట్లు తెలిపారు. రోడ్డు విస్తరణకు ఫారెస్ట్ అధికారులు ఆంక్షలు పెట్టకుండా రోడ్డు నిర్మాణం జరిగేలా ఫారెస్ట్ అధికారి సహకరించాలని కోరారు. రూ.10 కోట్లతో కిన్నెరసాని-రాజాపురం లో-లెవెల్ వంతెనను హై-లెవల్ వంతెనగా త్వరలో శంకుస్థాపన, పనులు ప్రారంభం చేయనున్నట్లు తెలిపారు. వెంగళ రావు కాలనీ నుండి బీసిఎం రోడ్డు వరకు సిమెంట్ రోడ్లు వేయుటకు ఫారెస్ట్ అధికారులతో చర్చించారు.పాల్వంచలోని శ్రీనివాస కాలనీ వెంకటేశ్వర స్వామి గుడికి గుట్ట మీదికి రోడ్డు వేయుటకు, దమ్మపేట రోడ్ లోని డంపింగ్ యాడ్ న్యూ షిఫ్ట్ చేసి, ఫారెస్ట్ స్థలంలో ఏర్పాటు చేయుటకు ఫారెస్ట్ అధికారులు సహకరించాలన్నారు. ఈ సమావేశంలో డీసీఎంఎస్ వైస్ చైర్మన్ కోత్వల శ్రీనివాసరావు, జెడ్పీటీసీ బరపటి వాసుదేవరావు, ఎంపిపిలు భూక్యా సోనా, మడకం సరస్వతి, డిఎఫ్ఓ రంజిత్ లక్ష్మణ్, ఎఫ్‌డిఓలు అపయ్య, దామోదర్ రెడ్డి, తిరుమలరావు, నలుగురు రేంజర్లు, పాల్వంచ మున్సిపల్ కమిషనర్ శ్రీకాంత్, ఆర్ అండ్ బి భీమ్లా, డిఇ నాగేశ్వరరావు, మున్సిపల్ డిఈ మురళి, అధికారులు పాల్గొన్నారు.