Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-చండ్రుగొండ
చండ్రుగొండ మండలంలో పనిచేస్తున్న మండల స్థాయి అధికారులు అందరూ గ్రామ ప్రజలకు అందుబాటులో ఉండాలని ఎంపీపీ భానోత్ పార్వతి సూచించారు. గురువారం చండ్రుగొండ మండల ప్రజా పరిషత్ సమావేశం మందిరంలో ఎంపీపీ బానోత్ పార్వతి అధ్యక్షతన సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ.. మహమ్మారి కరోనా వైరస్ రెండో స్టేజ్ రాష్ట్రంలో విస్తరిస్తున్నందున్న మండల ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు. అనంతరం పలువురు సర్పంచులు, ఎంపీటీసీలు పలు సమస్యలను సభ దృష్టికి తీసుకు వచ్చారు. ఎర్రగుంట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఉన్న దామరచర్ల, సీతయ్య గూడెం, మద్దుకూరు, గ్రామ పంచాయతీలను చండ్రుగొండ ఆరోగ్య కేంద్రంలో విలీనం చేయాలని గుంపెన సహకార సొసైటీ వైస్ చైర్మన్ నల్లమోతు వెంకటనారాయణ కోరారు. మిషన్ భగీరథ నీళ్లు అన్ని గ్రామాల్లో రావడంలేదని కొన్ని చోట్ల వస్తున్నప్పటికీ అవి సరిపోను రావటం లేదని తెలిపారు. ఏప్రిల్ 30 నాటికి పనులన్నీ పూర్తి చేసి అన్ని గ్రామాల్లో మంచినీటి అందిస్తామని ఆర్ డబ్ల్యుఎస్ ఏఈ సాయి కృష్ణ తెలిపారు. కరెంట్ ఇబ్బందులు లేకుండా చూస్తామని విద్యుత్ శాఖ ఏఈ దేవ తెలిపారు. అలాగే విద్యాశాఖ అధికారి సత్తెనపల్లి సత్యనారాయణ. మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా స్కూల్స్ నడిపించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో అన్నపూర్ణ, జడ్పి కోఆప్షన్ సభ్యులు ఎస్టీ రసూల్, మండల స్పెషల్ ఆఫీసర్ పులి రాజు, సిడిపిఓ నిర్మల జ్యోతి, మండల పంచాయతీ అధికారి తులసీరామ్, మండల వ్యవసాయ శాఖ అధికారి చటర్జీ, ఏపీఓ ప్రమీల, పంచాయతీ ఏఈ శ్రీనివాసరావు, ఆర్అండ్ బి ఏఈలక్ష్మణ్ ,ఎంపీటీసీలు దారా బాబు, లంక విజయలక్ష్మి, బొర్రా లలిత, గుంపెన సొసైటీ వైస్ చైర్మన్ నల్లమోతు వెంకటనారాయణ, ఐసిడిఎస్ సూపర్వైజర్ శకుంతల, సర్పంచులు కార్యదర్శులు పాల్గొన్నారు..