Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కొత్తగూడెం
ఐటిసీ బిపిఎల్ లో 11వ వేతన ఒప్పందంలో కార్మికులకు ఐఎన్టియూసీ చేసిన నష్టాలను వివరిస్తూ నిరసన కార్యక్రమాలలో భాగంగా బ్యాడ్జి ధారణ కార్యక్రమం చేస్తున్న సిఐటియూ కార్యకర్తలపై ఐఎన్టియూసీ, దాని మిత్రపక్షాల కార్యకర్తలు రామకోటి రెడ్డి, ఉమా మహేశ్వర రావు, షబ్బీర్, బసరత్, పిల్లి శ్రీను తదితులు భౌతిక దాడికి పాల్పడ్డారు. ఈ దాడిని సిఐటియూ తీవ్రంగా ఖండిస్తున్నట్లు జిల్లా అధ్యక్షులు, కార్యదర్శి యం.వి.అప్పారావు, ఉపాధ్యక్షులు కొలాగాని బ్రహ్మాచారిలు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. కార్మిక సంఘ నాయకులుగా ఉండి, భౌతిక దాడి చేయడం హేయమైన చర్య అన్నారు. వారు చేసిన గత వేతన ఒప్పందంలో జరిగిన నష్టాలపై మా కార్యకర్తలు చేసే ప్రచారంలో అవాస్తవాలు ఉంటే బహిరంగ చర్చకి సిద్దమేనా అని సవాల్ విసిరారు.