Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కొత్తగూడెం
మోడీ ప్రభుత్వం కార్పోరేట్, విదేశీ కంపెనీలకు అనుకూలంగా సవరణ చేసి 44 కార్మిక చట్టాలను 4 కోడ్లుగా మార్చివేసి ఏప్రియల్ 1వ తేదీ నుంచి ఆమలు చేయుటకు రాజ పత్రాన్ని విడుదల చేసిన కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా కొత్తగూడెం కార్పోరేట్ ఏరియాలలోని బొగ్గు బావులు, డిపార్టుమెంట్ల వద్ద నల్ల బ్యాక్టీలు ధరించి నిరసన తెలిపి, చట్టాల సవరణ చేసిన పత్రాలను కాల్చివేసి, సల్ల చట్టాలను రద్దు చేయాలని సింగరేణి ప్రధాన కార్యాలయం ముందు ధర్నా చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐటియూసీ నుండి గుత్తుల సత్యనారాయణ, వంగా వెంకట్, కంచర్ల జమలయ్య, క్రిస్ణోఫర్, ఐఎన్టియూసీి నుండి జలీల్, త్యాగరాజన్, కాలం నాగభూషణం, సిఐటియు నుండి కర్ల వీరస్వామి, ఎర్రగాని కృష్ణయ్య, ఐఎఫ్టియూ నుండి సాదినేని వెంకటేశ్వరరావు, ఎల్.విశ్వనాథం, పాల్గొన్నారు.
కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్ లను రద్దు చేయాలి
దుమ్ముగూడెం : కేంద్రప్రభుత్వం తెచ్చిన కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్ లను వెంటనే రద్దు చేయాలని సిఐటియు అనుబంద శ్రామిక మహిళ జిల్లా కార్యదర్శి జి. పద్మ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. యూనియన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు గురువారం ములకపాడు, లకీëనగరం సెంటర్లో కార్మిక కోడ్ ప్రతులను దహనం చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు మండల కన్వీనర్ కొర్సా చిలకమ్మ, నాయకురాళ్లు కమలాదేవి, రమణ, స్వరూప, జానకి , లకీ, పాపారావు, కాంచనమాల తదితరులు పాల్గొన్నారు.
కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం
మణుగూరు: కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం కార్మిక చట్టాల సవరణను వ్యతిరేఖిస్తూ ఇప్టూ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. గురువారం ఇప్టూ జిల్లా ఉపాధ్యక్షులు ఆర్.మధుసూదన్‌రెడ్డి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో నాయకులు జానయ్య, ఎం. శ్రీనివాస్‌రెడ్డి, బత్తుల వెంకటేశ్వర్లు, రాజేందర్, జంపాల యాకయ్య, పి. సంజీవరెడ్డి, ఎం. రామయ్య, మధు తదితరులు పాల్గొన్నారు.
కార్మిక చట్టాలను రద్దు పట్ల నిరసన
మణుగూరు: కేంద్ర ప్రభుత్వం 44 కార్మిక చట్టాలను 4 కోడ్లుగా మార్చడాన్నీ నిరసిస్తూ సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో కార్మికుల పని ప్రదేశాల్లో నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తేలియజేశారు. అనంతరం కోడ్ పత్రాలను కాల్చి నిరసన తేలియజేశారు. ఏఐటియుసి బ్రాంచ్ కార్యదర్శి వై. రాంగోపాల్ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో నాయకులు నామ వెంకటేశ్వరరావు, నజీరుద్దీన్ బాబు, రామనర్సయ్య, సుభానీ, యోహన్, అలీ, శ్రీనివాస్, సుధాకర్, మల్లేష్, రాజేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు
లేబర్ కోడ్ లు రద్దుచేయాలి : కె.బ్రహ్మ చారి
భద్రాచలం : కార్మికులను బానిసలుగా మార్చే లేబర్ కోడ్ లను రద్దు చేయాలని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు కె.బ్రహ్మాచారి డిమాండ్ చేశారు. కార్మిక హక్కులపై బీజేపీ ప్రభుత్వం చేస్తున్న దాడికి నిరసనగా లేబర్ కోడ్ ప్రతులను దహనం చేశారు.భద్రాచలం లో జరిగిన కార్యక్రమంలో బ్రహ్మాచారి మాట్లాడారు. పెట్టుబడి దారుల కోసమే బీజేపీ కార్మికచట్టాలను మార్పుచేసిందని అన్నారు. 8గంటల పనిని 12 గంటలకు పెంచే నిర్ణయం మానుకోవాలని డిమాండ్ చేశారు. వాటిని రద్దు చేసేవరకు పోరాటాలు కొనసాగుతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు రత్నం, నాగరాజు, చింతలపూడి రమేష్, రాజబాబు, అప్పారి రాము, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.