Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సింగరేణి జీఎం జక్కం రమేష్
మణుగూరు : బొగ్గు ఉత్పత్తి, ఉత్పాదక, రవాణాలో కొత్త రికార్డులు నమోదు చేసుకోవడం ఆనవాయితీగా మార్చుకున్న మణుగూరు సింగరేణి ఏరియా జీఎం జక్కం రమేష్ అన్నారు. గురువారం సింగరేణి ఏరియాలో జరిగిన అధికారుల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ... 2020-21 వార్షిక ఉత్పత్తి లక్ష్య సాధనలోను గత రికార్డులను తిరగరాస్తు నిబ్బదతో కూడిన పని తనానికి గొప్ప నిదర్శణం సరికొత్త రికార్డులను సృష్టించడంమన్నారు. కరోనా ప్రభావ అవాంతరాలను అధిగమించి వార్షిక ఉత్పత్తి లోటును పూరించడమే గాక బొగ్గు, ఓబి వెల్కితీతలో సరికొత్త రికార్డును నమోదు చేసిందన్నారు. 2020-21 వార్షిక చివరి నెల అయిన మార్చి 26న ఒక్క రోజు అత్యధికంగా 49,007 టన్నుల బొగ్గును రవాణా చేసిందన్నారు. పికెఓసి ఓబి వెల్కితీత 168శాతం, ఎంఎస్జిఓసి 100శాతం ఉత్పత్తి సాధించడం అంతేకాకుండా 220 ర్యాకుల బొగ్గు రవాణా చేయడం జరిగిందన్నారు. వార్షిక చివరి రోజున సింగరేణి చిరిత్రలో మొట్ట మొదటి సారిగా మార్చి 31వ తేదిన 60వేల టన్నుల బొగ్గును డిస్పాచ్ చేయడం జరిగిందని, ఈ వార్షిక సంవత్సరం మొత్తం 87శాతం బొగ్గు ఉత్పత్తిని సాధించడం జరిగిందన్నారు. సింగరేణియులందరికీ స్వీట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సింగరేణి అధికారులు రాముడు, ఫిజ్రాల్డ్, ఎండి.రజాక్పాషా, వెంకటరమణ, ఉషా శ్రీ, సురేష్, వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు.