Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కలెక్టర్ డాక్టర్ ఎంవి.రెడ్డి
నవతెలంగాణ-కొత్తగూడెం
యాసంగి ధాన్యం కొనుగోళ్లులో రైతులు ప్రభుత్వ సూచించిన జాగ్రత్తలు పాటిస్తూ విక్రయాలు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎంవి. రెడ్డి రైతులకు సూచించారు వరి కోతలు ప్రారంభం అవుతున్నందున రైతులు ధాన్యం విక్రయాలు నిర్వహణకు జిల్లాలో 150 ధాన్యం కొనుగోళ్లు కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. ధాన్యం విక్రయించు రైతులు పట్టాదారు పాసుపుస్తకము, ఆధార్‌కార్డు, బ్యాంకు పాసు పుస్తకము వెంట తెచ్చుకోవాలని తెలిపారు. పట్టాదారు పాసు పుస్తకము లేనట్లయితే వ్యవసాయ అధికారుల దృవీకరణ తీసుకోవాలని చెప్పారు. జిల్లాలో ఈ యాసంగి సీజన్ 71384 ఎకరాల్లో వరి పంట సాగు చేశారని, 178460 మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందనే అంచనాతో ఉన్నట్లు తెలిపారు. పిఏసిఎస్ ద్వారా 117, జిసిసి ద్వారా 12, డిఆర్ డీఏ ద్వారా 10, వ్యవసాయ మార్కెట్ ద్వారా 11 మొత్తం 150 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ధాన్యపు గింజలను భద్రపరచేందుకు 22 లక్షల 50 వేల గన్నీ సంచులు అవసరమున్నట్లు కార్యాచరణ తయారు చేశామని ప్రస్తుతానికి అందుబాటులో దాదాపు 15 లక్షలు వరకు ఉండగా మిగిలిన గన్నీ బ్యాగులు సరఫరాకు ప్రభుత్వానికి నివేదికలు పంపినట్లు చెప్పారు.
ఏప్రిల్ 30వ తేదీ వరకు కోవిడ్ ఆంక్షలు
కరోనా నేపథ్యంలో గుడ్ ఫ్రైడే, ఈస్టర్, ఉగాది, శ్రీరామ నవమి, రంజాన్ మొదలైన పండుగల సందర్భంగా బహిరంగ వేడుకలు, ఆచారాలకు అనుమతిని రద్దు చేసినట్లు కలెక్టర్ తెలిపారు. ఏప్రిల్ 30వ తేదీ వరకు నియంత్రణ అమలులో ఉంటుందని తెలిపారు.