Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మణుగూరు: భద్రాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ భూ నిర్వాసితులందరికీ ఈనెలలోనే 346 మందికి శాశ్వత ఉద్యోగాలు ఇస్తామని సీఈ బాలరాజు తెలిపారు. గురువారం భూ నిర్వాసితులందరూ ర్యాలీ నిర్వహించి బీటీపిఎస్ గేట్ ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా బిటిపిఎస్ సీఈ బాలరాజు మాట్లాడుతూ... సిఎం కేసీఆర్ ఆదేశాల మేరకు సిఅండ్ఎండి ప్రభాకర్‌రావు, గౌరవ డైరెక్టర్లు బిటిపిఎస్ భూ నిర్వాసితులకు శాశ్వత ఉద్యోగాలు ఇచ్చేందుకు నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు. ఈనెలలోనే అందరికి ఉద్యోగాలు వస్తాయని వారికి హామీ ఇచ్చారు. అనంతరం భూ నిర్వాసితులందరూ ధర్నాని విరమించారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు సంతోష్‌రెడ్డి, కార్యదర్శి దార్ల సతీష్, నాగిరెడ్డి, త్రిపాల్రెడ్డి, తాజుద్దీన్, నాగరాజు, జ్యోతి,రూప్‌రెడ్డి సంతోష్‌రెడ్డి, తాతారావు, పిచ్చిరెడ్డి, పిడతల వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.