Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-తల్లాడ
2018వ సంవత్సరంలో తల్లాడ సొసైటీ నుండి 742 రూపే కార్డులను దొంగిలించారు. ఈ కార్డుల ద్వారా రూ.44 లక్షల 50 వేలు డ్రా చేసుకున్నారు. సొసైటీ సిబ్బందికి విషయం తెలిసి కొంత సొమ్మును రికవరీ చేశారు. మిగతా సొమ్ము రికవరీ కాలేదు. 2021 జనవరిలో పోలీసులకు ఫిర్యాదు చేశారు. రూపే కార్డు దొంగిలించిన వారిని గుర్తించి వారి నుండి వారికి సహకరించిన సొసైటీ సిబ్బంది నుండి పోయిన సొమ్మును రికవరీ చేశారు. ఆ సొమ్ము ఇంతవరకు రైతుల ఖాతాలలో జమ కాలేదు. రైతుల సొమ్ము ఎప్పుడు జమ చేస్తారు, ఎన్నాళ్ళు తాత్సారం ఎందుకు చేశారని అఖిలపక్ష నాయకులు సంబంధిత అధికారులను ప్రశ్నించారు. 51 ఆడిట్ నిర్వహించి బాధ్యులు అందర్నీ విచారించి క్రిమినల్ కేసు నమోదు చేయాలని అఖిల పక్ష నాయకులు డిమాండ్ చేశారు. రూపే కార్డు ద్వారా దొంగిలించిన సొమ్ముకు రైతులు వడ్డీలు చెల్లిస్తున్నారు. కానీ వారి సొమ్ము ఖాతాలలో జమ కాలేదు. రికవరీ చేసిన సొమ్ము ఎక్కడుంది, దొంగలను ఎందుకు అరెస్టు చేయలేదు అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయని సంబంధిత అధికారులు వెంటనే స్పందించి, బాధ్యులను అరెస్టు చేసి రైతుల సొమ్ము జమ చేయాలని తెలంగాణ రైతు సంఘం నాయకులు గుంటుపల్లి వెంకటయ్య, అయినాల రామలింగేశ్వర, కాంగ్రెస్ నాయకులు దగ్గుల రఘుపతి రెడ్డి, సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ మండల కార్యదర్శి షేక్ లాల్ మియా లాల్ మియా, తెదేపా మండల అధ్యక్షుడు కూచిపూడి వెంకటేశ్వర రావు, ముచ్చింతల చెన్నయ్య డిమాండ్ చేశారు.