Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సారపాక
ముగ్గురు స్నేహితులు గోదావరి నదిలోకి దిగగా ప్రమాదవశాత్తు ఇద్దరు గల్లంతైన సంఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండల పరిధిలోని మోతే పట్టీనగర్లో గురువారం సాయంత్రం చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం... మండల పరిధిలోని సారపాక రిక్షా కాలనీలో నివాసముంటున్న నిమ్మల వెంకటేశ్వరరావు కుమారుడు నిమ్మల హరిచంద్(25) తాను పెంచుకుంటున్న కుక్కకు స్నానం చేయించేందుకు తన స్నేహితులైన తాళ్లగొమ్మూరులోని సత్యనారాయణ, నాగమణి దంపతుల రెండవ కుమారుడు జమ్మి షణ్ముఖరావు (23), వడ్లమూడి వెంకటేశ్వరరావు కుమారుడు చక్రితో కలిసి మోతే పట్టీనగర్లోని పుష్కరఘాట్ సమీపంలోని గోదావరి నదిలోకి దిగారు. కుక్కకు స్నానం చేయించే క్రమంలో ఇద్దరు గల్లంతవ్వగా చక్రి అనే యువకుడు మాత్రం సురక్షితంగా బయటకు వచ్చాడు. అయితే వారు దిగిన ప్రవేశంలో లోతు ఎక్కువగా ఉండటంతో ఈత రాని హరిచంద్, షణ్ముఖరావులు గల్లంతయ్యారు సురక్షితంగా బయటకు వచ్చిన చక్రి కేకలు వేయగా స్థానికులు అక్కడకు చేరుకున్నారు. సొసైటీ చైర్మన్ బిక్కసాని శ్రీనివాసరావు పోలీసులు, రెవెన్యూ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. గజ ఈతగాళ్లు, పడవతో గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. రాత్రి వరకు గల్లంతైన ఇద్దరు వ్యక్తులు జాడ తెలియరాలేదు.