Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు పొన్నం వెంకటేశ్వరరావు
నవతెలంగాణ-చింతకాని
రైతుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని మొక్కజొన్న కొనుగోలు కేంద్రం ప్రభుత్వం తక్షణమే ఏర్పాటు చేయాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు పొన్నం వెంకటేశ్వరావు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సీపీఐ(ఎం) చింతకాని మండల కమిటీ సమావేశంలో పొన్నం వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలను మాత్రమే ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించిందన్నారు. వానాకాలం పంటలు పత్తి పంట సాగు చేసిన అన్నదాతలు అందరూ అకాల వర్షాలతో తీవ్రంగా నష్టపోయిన యాసంగి పంటగా జిల్లావ్యాప్తంగా లక్షలాది ఎకరాల్లో మొక్కజొన్న పంట సాగు చేశారు. ప్రస్తుతం కొనుగోలు కేంద్రాలు లేకపోవడంతో దళారులు గ్రామాల్లో తిరుగుతూ తక్కువ ధరకు రైతుల వద్ద నుండి కొనుగోలు చేస్తున్నారని దీంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ మధిర నియోజకవర్గ కన్వీనర్ చింతలచెరువు కోటేశ్వరరావు, పార్టీ మండల కార్యదర్శి మడిపల్లి గోపాల్ రావు, మండల నాయకులు నాయకులు వత్సవాయి జానకిరాములు, మండల కమిటీ సభ్యులు నన్నక కృష్ణమూర్తి, మదిని బసవయ్య, తిరుపతి, అంజయ్య, బల్లి వీరయ్య, గడ్డం రమణ, రాచబంటి, రాము యజ్ఞ నారాయణ, కాటా బత్తిన వీరబాబు తదితరులు పాల్గొన్నారు.