Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 128 శాతంతో లక్ష్యాన్నిఅధిగమించాం
- 976 మందికి మెడికల్ హెల్త్ కార్డులు జారీ
- 115 మందికి ఉద్యోగ నియామక ఉత్తర్వులు
- విలేకర్ల సమావేశంలో జిఎం సత్యనారాయణ
నవతెలంగాణ-ఇల్లందు
సింగరేణిలో బొగ్గు ఉత్పత్తి సాధనలో ఇల్లందు ఏరియా ద్వితీయ స్థానం పొందిందని జిఎం సత్యనారాయణ అన్నారు. స్థానిక కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మార్చి నెల బొగ్గు ఉత్పత్తి వివరాలను జియం పి.వి. సత్యనారాయణ తెలిపారు. 2021- మార్చి నెలలో ఉత్పత్తి 5.05 లక్షల టన్నులకు గాను 6.44 లక్షల టన్నుల బొగ్గు తీశామని, కె.ఒసి.లో 145 శాతం, జె.కె.ఓసి లో 114 శాతం తో మొత్తం 128 శాతంతో సింగరేణి లోనే ద్వితీయ స్థానంలో నిలిచిందని అన్నారు. అలాగే 2020-21 ఆర్థిక సంవత్సరంలో ఇల్లందు ఏరియాకు నిర్దేశించిన 62.20 లక్షల టన్నులకు గాను 49.23 లక్షల టన్నుల బొగ్గు తీసి 79 శాతంతో సింగరేణిలోనే నాల్గవ స్థానంలో నిలిచిందని అన్నారు. 4.65 లక్షల టన్నుల బొగ్గు రైల్వే మార్గం ద్వార రోడ్డు మార్గం ద్వారా 1.42 లక్షల టన్నులు మొత్తం 6.06 లక్షల టన్నుల బొగ్గు రవాణా చేసిందని తెలిపారు. అలాగే మార్చి నెలలో 125 రేకుల బొగ్గు రవాణా చేశామని అన్నారు.
ఇల్లందు ఏరియాలో ఇప్పటివరకు 115 మందికి ఉద్యోగ నియామక ఉత్తర్వులు ఇవ్వడంజరిగినదని తెలిపారు. అలాగే గృహ రుణాలకు వడ్డీని 116 మంది ఉద్యోగులకు చెల్లించామన్నారు. ఇప్పటివరకు విశ్రాంత ఉద్యోగులకు మెడికల్ హెల్త్ కార్డులను 976 మందికి జారిచేయడమైనది.ఈ ఉత్పత్తిని సమిష్టి కృషి, రక్షణతో కూడిన బొగ్గు ఉత్పత్తి చేయడంపట్ల సంబంధిత కార్మికులను, సూపర్వైజర్ లను, అధికారులను జియం అభినందించినారు. ఈ సమావేశంలో ఎజియం ప్రభాకర్‌రావు, డిజిఎం పర్సనల్ సి.హెచ్.లక్ష్మీనారాయణ, ఎజియం (ఐఇడి) యం.గిరిధరరావు, డిజియం ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ బి.వెంకటరామచంద్ర, సర్వే అధికారి బాలాజీనాయుడు, ఎస్టేట్ అధికారి తౌరియనాయక్ సమాచార శాఖా సమన్వయ కర్త సత్యనారాయణ పాసి తదితరులు పాల్గొన్నారు.