Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- లేబర్ ఎన్పోర్సుమెంట్ కార్యాలయం (ఎల్ఇఓ) ముందు ధర్నా
- కార్మిక కోడ్ ప్రతులను దహనం
- కోడ్ల అమలు నిలిపివేసే వరకు పోరాటం
నవతెలంగాణ-కొత్తగూడెం
కేంద్ర బీజేపీ ప్రభుత్వం పార్లమెంట్లో ఏకపక్షంగా ఆమోదింప చేసుకున్న కార్మిక కోడ్ల అమలును నిరసిస్తూ సీఐటియు ఆధ్వర్యంలో గురువారం స్థానిక లేబర్ ఎన్పోర్సుమెంట్ కార్యాలయం (ఎల్ఇఓ) ముందు ధర్నా చేసి, కార్మిక కోడ్ ప్రతులను దహనం చేశారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా అధ్యక్షులు యం.వి .అప్పారావు అధ్యక్షతన జరిగిన సభలో సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు మందా నరసింహా రావు, జిల్లా కార్యదర్శి ఎ.జె.రమేష్‌లు మాట్లాడుతూ ఏప్రియల్ 1నుండి అమలు కావాల్సిన కార్మిక కోడ్లను రాష్ట్ర ప్రభుత్వాల అభిప్రాయాలు తీసుకుని రూల్స్ రూపొందించుకున్న తరువాత అమలు చేస్తామని, అప్పటి వరకు వాయిదా వేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం చూస్తుంటే కార్మిక కోడ్ల అమలు నిరవధికంగా నిలిపి వేయడం జరగదని అన్నారు. దర్నా అనంతరం కార్మిక కోడ్ల ప్రతులను దగ్దం చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి యర్రగాని కష్ణయ్య, సింగరేణి కాలరీస్ ఎంప్లాయిస్ యూనియన్ నాయకులు కర్ల వీరాస్వామి, కూరపాటి సమ్మయ్య, వై.వెంకటేశ్వర్లు, అరుణ్ తదితరులు పాల్గొన్నారు.
సింగరేణిలో....
కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన లేబర్ కోడ్లను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ సిఐటియూ అనుబంధ సింగరేణి కాంట్రాక్టు కార్మికుల సంఘం ఆధ్వర్యంలో గురువారం నాడు సివిల్ ఆఫీస్, హాస్పిటల్ ఏరియా తదితర పని ప్రదేశాలలో లేబర్ కోడ్ కాపీలను దగ్ధం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు యర్రగాని కృష్ణయ్య నాయకులు కె.నరసింహారావు, వినోద, విజయలక్ష్మి, శంకర్, రమణ, సంజీవరావు, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
సారపాక : కార్మికులను బానిసలుగా మార్చే లేబర్ కోడ్ లను రద్దు చేయాలని సీఐటీయూ జిల్లా ఉపాధ్యాక్షులు కె.బ్రహ్మాచారి డిమాండ్ చేశారు. కార్మిక హక్కులపై బీజేపీ ప్రభుత్వం చేస్తున్న దాడికి నిరసనగా గురువారం బూర్గంపాడు మండలం సారపాక ఐటీసీ పరిశ్రమగేటుముందు లేబర్ కోడ్ ప్రతులను దగ్ధం చేశారు. కార్యక్రమంలో సీఐటీయూ ఐటీసీ కాంట్రాక్టు ఎంప్లాయిస్ యూనియన్ కార్యదర్శి పాషా, నాయకులు రాము, వెంకటేశ్వర్లు, శ్రీను పాల్గొన్నారు.