Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు కాసాని అయిలయ్య
నవతెలంగాణ-కొత్తగూడెం
ప్రయివేటు విద్యాసంస్థలలో పనిచేస్తున్న అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బందికి నెలకు రూ.10 వేలు కరోనా భృతి ఇవ్వాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు కాసాని అయిలయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేసారు. స్థానిక మంచికంటి భవన్లో గురువారం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మచ్చా వెంకటేశ్వర్లు అధ్యక్షతన జరిగిన జిల్లా ముఖ్య కార్యకర్తల సమావేశంలో కాసాని మాట్లాడుతూ ప్రభుత్వం గతంలో విధించిన లాక్ డౌన్ వలన ఒక వైపు ప్రైవేటు విద్యాసంస్థల యాజమాన్యాలు వేతనాలు ఇవ్వక మరో వైపు ప్రభుత్వం నుండి ఎటువంటి ఆర్ధిక సహాయం అందక ప్రైవేటు విద్యాసంస్థలో పని చేస్తున్న సిబ్బంది ఆర్థికంగా చితికిపోయారని తెలిపారు. కుటుంబాలు గడవడానికి తీవ్ర ఇబ్బందులు పడ్డారని అయన ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్సి ఎన్నికల ప్రచారం కోసమే ప్రభుత్వం విద్యా సంస్థలు ప్రారంభించినట్టుగా ఉందని ఎద్దేవా చేసారు. బార్లకు, సినిమా హాళ్ళకు లేని కరోనా విద్యసంస్థలకే ఉందా....? అని ఆయన ప్రశ్నించారు. పది నెలల పాటు సిబ్బందికి రూ.10 వేలు కరోనా భతి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి అన్నవరపు కనకయ్య, కార్యదర్సివర్గ సభ్యులు ఏజే.రమేశ్, గుగులోత్ ధర్మ, జిల్లా కమిటి సభ్యులు కొండపల్లి శ్రీధర్, లిక్కి బాలరాజు, యస్ఏ.నభీ,ó దొడ్డా రవికుమార్, పుల్లయ్య, నిమ్మల వెంకన్న, రేపాకుల శ్రీను, వీర్ల రమేశ్, భుక్య రమేశ్, యాసా నరేశ్, సత్యనారాయణ, లక్ష్మి, సత్య, వాణి తిరుపతిరావు తదితరులు పాల్గొన్నారు.