Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సొసైటీ అధ్యక్షుడు కాళంగి గురవయ్య
అశ్వాపురం : ఇటీవల భారజల కర్మాగార కోపరేటీవ్ సొసైటీ ఎన్నికలలో ఓటమిని చవిచూసిన టీఆర్టీయూ ఫ్యానల్ నుండి పోటీచేసిన వారు ఓటమిని భరించలేకనే లేనిపోని విమర్శలు చేస్తున్నారని భారజల కర్మాగార ఎంప్లాయిస్ కోపరేటీవ్ సొసైటీ అధ్యక్షుడు కాళంగి గురవయ్య అన్నారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. నేను ప్రజాస్వామ్య బద్దంగా గెలుపొందానన్నారు. ఎక్కడ ఎవరిని ప్రలోబాలకు గురిచేయకుండా ఎన్నికల నిబందనలు, నియమావళిని తూచ తప్పకుండా పాటించి ప్రత్యేక్ష ఎన్నికలలో పోటీసీ సంఘ సభ్యుల అభిమానంతో విజయకేతనం ఎగురవేసానన్నారు. అదేవిధంగా అనాడు ఐఎన్టీయూసి ఫ్యానల్ మొత్తం అత్యధిక మెజరీటీతో గెలుపొంది తిరుగులేని శక్తిగా ఎదిగిందన్నారు. ఇప్పుడు కొందరు శక్తులు తమపై బురద జల్లే ప్రయత్నాలు చేయడం హాస్యస్పదంగా ఉందన్నారు. బైలాలో ఉన్న 5బి సంబంధించిన అంశాన్ని జిల్లా కోపరేటీవ్ ఉన్నతధికారులు నివేదించానన్నారు. తాము ఎవరి కళ్ళు కప్పి సొసైటీని పాలించడంలేదని, తామేంటో ఉద్యోగులకు, సొసైటీ సభ్యులకు తెలుసన్నారు. నిజనిజాలను జిల్లా కోపరేటీవ్ ఉన్నతాధికారులు త్వరలో తేలుస్తారన్నారు. ఎవరి కళ్ళు కప్పితాము అందలమెక్కలేదని ప్రజలే తమను గద్దెపై కూర్చోబెట్టారని ఈ సందర్భంగా ఆయన అన్నారు. నా 13 సంత్సరాల సొసైటీ ప్రస్థానంలో చేసిన అభివృద్ధి ప్రతీ ఒకరికి తెలుసన్నారు. లేనిపోని విమర్శలు చేస్తు సంఘాన్ని అబాసుపాలు చేయకుండా ప్రతీ సభ్యుడు సొసైటీ అభివృద్ధిపై దృష్టిపెట్టి సంఘానికి సహకరిస్తే ఉద్యోగులకు మరింత మేలు చేకూరుతుందన్నారు.