Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కారు స్వాధీనం, ఇద్దరు వ్యక్తులపై కేసు నమోదు
దుమ్ముగూడెం : ఆంధ్ర, ఒరిస్సా రాష్ట్రాల సరిహద్దు ప్రాంతాల నుండి కారులో 178 కేజీల గంజాయిని తరలిస్తున్న ఓ వ్యక్తిని దుమ్ముగూడెం పోలీసులు గురువారం అదుపులోకి తీసుకున్నారు. దీని విలువ సుమారు 26 లక్షల 70 వేల రూపాయలు ఉంటుందని పోలీసులు తెలిపారు. ఇందుకు సంబందించి సిఐ నల్లగట్ల వెంకటేశ్వర్లు తెలిపిన వివరాల ప్రకారం...ఎస్ఐ రవికుమార్, సిఆర్పిఎఫ్ 141- జి ఇన్స్పెక్టర్ సత్యనారాయణ మరియు పోలీస్, సిఆర్పిఎఫ్ సిబ్బందితో కలిసి గురువారం ఉదయం 6 గంటల సమయంలో సీతానగరం గ్రామ శివారలో వాహన తనిఖీలు చేస్తుండా పారిపోతుండగా పట్టుకున్నారు. విచారణలో తనది అదిలాబాద్ జిల్లా క్రాంతి నగర్ కు చెందిన షేక్ ఇర్ఫాన్ గా తెలపడంతో పాటు తాను కర్షిద్ నగర్‌కు చెందిన షేక్ షారుక్ వద్ద కారు డ్రైవర్ గా పని చేస్తున్నానని తెలిపాడు. తన యజమాని షారుక్ ఆంద్ర, ఒరిస్సా రాష్ట్రాల సరిహద్దుల ప్రాంతాలలో తక్కువ ధరకు గంజాయి కొనుగోలు చేశాడని, అట్టి గంజాయిని తాను అదిలాబాద్ కు తీసుకు వెళుతున్నట్లు విచారణలో తెలిపాడన్నారు. కారులో ఉన్న గంజాయి పరీశీలించగా మొత్తం 89 గంజాయి ప్యాకెట్లు ఉండగా వాటి బరువు 178 కేజీలు ఉందన్నారు. ఒక్క కేజీ గంజాయి విలువ 15 వేల రూపాయలు కాగా మొత్తం 26 లక్షల 70 వేల రూపాయలు ఉంటుందన్నారు. గంజాయి తరలిస్తున్న కారును స్వాదీన పర్చుకుని డ్రైవర్ ఇర్ఫాన్, కారు యజమాని షారుక్ ల కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సిఐ వెంకటేశ్వర్లు తెలిపారు.