Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టీఆర్ఎస్ లోక్‌సభా పక్ష నేత, ఖమ్మం ఎంపీ నామ నాగేశ్వరరావు
నవతెలంగాణ-ఖమ్మంప్రాంతీయప్రతినిధి
సీఎం కేసీఆర్ సారధ్యంలో తెలంగాణ అద్భుత ప్రగతి నేపధ్యంలో జరగబోతున్న నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ చరిత్ర సృష్టించి, విజయఢంకా మోగించడం ఖాయమని, సాగర్ ఎన్నిక తర్వాత రాజకీయ పునరేకీకరణ మరింత వేగం పుంజుకుంటుందని, ఇతర పార్టీల నుంచి పెద్ద ఎత్తున టీఆర్ఎస్లోకి వలసలు పెరుగుతాయని టీఆర్ఎస్ లోక్‌సభా పక్ష నేత, ఖమ్మం పార్లమెంట్ సభ్యులు నామ నాగేశ్వరరావు గురువారం ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. ఈ ఉప ఎన్నికల్లో టిఆర్ఎస్ గెలుపును ఏ శక్తి అడ్డుకోలేదని, టీఆర్ఎస్ ప్రభంజనం తధ్యమని ధీమా వ్యక్తం చేశారు. గులాబీ దళపతి కేసీఆర్ రాజకీయ వ్యూహం ముందు ఏ పార్టీ నిలబడలేదన్నారు. రుణ మాఫీ నిధుల విడుదలకు కూడా తెలంగాణ ప్రభుత్వం కసరత్తు చేస్తుందన్నారు. శుక్రవారం ఖమ్మం జిల్లాలో వందల కోట్ల అభివృద్ధి పనులకు మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా ప్రారంభోత్సవం, శంకుస్ధాపనలు చేసుకోవడం ద్వారా మరింత అభివృద్ధికి దోహదమైందని ఎంపీ నామ పేర్కొన్నారు.
ప్రేమకు ప్రతిరూపమే క్రీస్తు : ఎంపీ నామ
మనుషులను మహౌన్నతులుగా మలిచేందుకు క్రీస్తు శిలువపై బలియాగం చేశారని టీఆర్ఎస్ లోక్‌సభా పక్ష నేత, ఖమ్మం పార్లమెంట్ సభ్యులు నామ నాగేశ్వరరావు గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రజల పాపాలను ప్రక్షాళన చేయడానికి క్రీస్తు సిద్దపడ్డ రోజే శుభ శుక్రవారం అని అన్నారు. క్రీస్తు శుక్రవారం మరణించి, మూడో రోజు లేచిన రోజునే ఈస్టరు పర్వదినమని నామ పేర్కొన్నారు.