Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) మండల కార్యదర్శి జాజిరి శ్రీనివాస్‌రావు
నవతెలంగాణ-సత్తుపల్లిరూరల్
సత్తుపల్లి మండల పరిధిలోని బుగ్గపాడు, గాంధీ నగర్, రుద్రాక్షపల్లి గ్రామాలలోని 118 కుటుంబాలు మెగా ఫుడ్ పార్కు కింద భూములు కోల్పోయారని, వారికి నష్టపరిహారంతో పాటు ఉద్యోగాలు కల్పించాలని సీపీఐ(ఎం) మండల కార్యదర్శి జాజిరి శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. గురువారం బుగ్గపాడు భూనిర్వాసితుల సమావేశంలో జాజిరి మాట్లాడుతూ మెగా ఫుడ్ పార్కు నిర్మాణం కోసం జీవనాధారమైన 186 ఎకరాల వ్యవసాయ భూములను ప్రభుత్వం బలవంతంగా లాక్కొని నేటికీ 14 సంవత్సరాలు అవుతున్నా.. ఇంకా ఫుడ్ పార్కు నిర్మాణం పూర్తి కాలేదన్నారు. ఆనాటి ప్రభుత్వం ఎకరాకి 80 వేల నుంచి లక్ష రూపాయల వరకే ఇచ్చి నాలుగు సంవత్సరాలలో ఫుడ్ పార్కు నిర్మాణం పూర్తి చేసి ఇంటికో ఉద్యోగం ఇస్తామని మాయమాటలు చెప్పారన్నారు. భూనిర్వాసితుల కుటుంబాలు ఉద్యోగాలు కోసం..ఎదురు చూస్తూ.. ఇటు పంటభూములు లేక ఉద్యోగాలు రాక.. నిర్వాసిత కుటుంబాలు ఆర్థికంగా అనేకరకాల ఇక్కట్లు పడుతున్నారన్నారు.