Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హామీల ఊసే లేదు : సీపీఐ(ఎం), టీడీపీ
నవతెలంగాణ- సత్తుపల్లి రూరల్
మంత్రి కేటీఆర్ సత్తుపల్లి నియోజకవర్గ పర్యటన పట్టణ, మండల ప్రాంత ప్రజలకు నిరాశనే మిగిల్చిందని తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షులు బొంతు శ్రీనివాసరావు, సీపీఎం మండల కార్యదర్శి జాజిరి శ్రీనివాసరావులు అన్నారు. కేటీఆర్ సభకు.. కరోనా భయాన్ని, ఎండని, వేడిగాలులు లెక్క జేయకుండా వచ్చిన సత్తుపల్లి ప్రాంత ప్రజలకు చివరకి నిరాశే మిగిలిందని వారు ఆరోపించారు. మంత్రి కేటీఆర్ ఎటువంటి వరాల జల్లులు ఇస్తారోనని ఎంతో ఆశతో సభ ముగింపు వరకు ఎదురు చూస్తూ వున్నా ఫలితం లేదని, ఆఖరికి స్థానిక ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య సైతం శానన సభలో పదేపదే లేవనెత్తిన, ప్రతి పక్షాలు, ప్రజాసంఘాలు, ప్రజలు ఎన్నోమార్లు ప్రభుత్వానికి అధికారుల ద్వారా తెలియజేసిన ఎన్నో ముఖ్యమైన సమస్యలు ఊసే మంత్రి కేటీఆర్ తీయలేదన్నారు. సింగరేణి గనులు తవ్వకాల వల్ల ప్రజలు పడుతున్న ఇబ్బందులు, సొంత స్థలాల్లో రెండు పడకల ప్రభుత్వ ఇండ్లు మంజూరు, క్రికెట్ ఇండోర్ స్టేడియం నిర్మాణం, సీతారామ ఎత్తి పోతల పథకం, బేతుపల్లి చెరువుకు లింక్ ఏర్పాటు, ఏండ్లు గడుస్తున్నా పూర్తిగాని బుగ్గపాడు మెగాఫుడ్ పార్కు, దాని నిర్వాసితులకు సరైన నష్ట పరిహారం, ఉద్యోగాల విషయం, కూలిపోవడానికి సిద్ధం గా వున్న ప్రభుత్వ కమ్యూనిటీ హెల్త్ సెంటర్, ఆర్టీసీ బస్టాండ్, యువత కు సాంకేతిక విద్య అందించే ప్రభుత్వ పాలిటెక్నీక్ కళాశాల, మెడికల్ కళాశాల, ఐటీ హబ్ ఏర్పాటు, సత్తుపల్లిని జిల్లా చేయడం తదితర ఎన్నో కీలక సమస్యలు ఉన్నాయని, వీటిలో ఏ ఒక్క సమస్యపైనా కేటీఆర్ హామీ ఇవ్వలేదన్నారు.