Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఖమ్మం
టీఎన్జీవో నాయకులు, ఉద్యోగులకు ఇచ్చిన మాట ప్రకారం పిఆర్సీ ఫిట్మెంట్ 30 శాతం, ఉద్యోగ విరమణ వయస్సు 61 సంవత్సరాలకు పెంచడం, ఉద్యోగులకు అనుకూలమైన ఎన్నో సదుపాయాలు ఇచ్చినందుకు, ప్రభుత్వంలో భాగస్వాములైన రాష్ట్ర మున్సిపల్, పట్టణాభివృద్ధి, సాంకేతిక శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు, రాష్ట్ర రోడ్లుభవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంతరెడ్డి, రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజరు కుమార్లకు యూనియన్ అధ్యక్షులు పొట్టపెంజర రాజారావు(రామయ్య) ఆధ్వర్యంలో అభివృద్ధి పనుల ప్రారంభానికి ఖమ్మం వచ్చిన సందర్భంగా కలిసి వారిని సన్మానించి, వారికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ ఈ ప్రభుత్వం ఉద్యోగులకు ఎప్పుడూ అందుబాటులో ఉంటూ, వారి సంక్షేమం కోసం ఎప్పుడూ కృషి చేస్తుందని, ఉద్యోగుల సంక్షేమం కోరే ఇలాంటి ప్రభుత్వాలకు ఉద్యోగుల మద్దతు ఎప్పుడూ ఉంటుందని జిల్లా అధ్యక్షులు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి గంగవరపు బాలకృష్ణ, కోమరగిరి దుర్గా ప్రసాద్, వళ్ళోజి శ్రీనివాసరావు, యెర్రా రమేష్, శ్రీధర్ సింగ్, చంద్రకాని రమణ యాదవ్, బుసా చంద్రశేఖర్, సగ్గుర్తి ప్రకాష్ రావు, హరికృష్ణ, అచ్యుత్ రామ్, పట్టణ అధ్యక్షుడు గుంటుపల్లి శ్రీనివాసరావు, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.