Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-పాల్వంచ
పాల్వంచ నవభారత్ సెంటర్లోని భద్రాచలం తెలంగాణ మైనార్టీ గురుకులం ప్రిన్సిపాల్‌గా రమేశ్‌లాల్ శుక్రవారం పదవీ బాధ్యతలు చేపట్టారు. ఆయన ఇటీవల టీఎస్పీఎస్సీ గురుకులం ప్రకటించిన ప్రిన్సిపాల్ ఎంపికలో భద్రాచలం మైనార్టీ పాఠశాలలకు ప్రిన్సిపాల్‌గా నియమితులయ్యారు. రమేశ్‌లాల్ గతంలో మహారాష్ట్రలోని కేంద్రీయ విద్యాసంస్థలో ప్రిన్సిపాల్‌గా విశిష్ట సేవలు అందించారు. సీబీఎస్ నుండి బెస్ట్ ప్రిన్సిపాల్ అవార్డు పొందడంతో పాటు ఎక్సామినేషన్స్ ప్యానెల్బోర్డులో పరిశీలకుగా ఉన్నారు. ఇంత అనుభవం నైపుణ్యం కలిగిన ప్రిన్సిపాల్ తమ పాఠశాలకు రావడం పట్ల విద్యార్థులు ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ రమేశ్‌లాల్ హట్కర్ మాట్లాడుతూ మైనార్టీ పాఠశాలలో విద్యా ప్రమాణాలతో ఉచితంగా విద్యను భోధించడం జరుగుతుందని, ఉచిత వసతితో పాటు నాణ్యమైన భోజనం కూడా కల్పించబడుతుందని ప్రతీ ఒక్క మైనార్టీ విద్యుర్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. పాఠశాల అభివృద్ధికి తమ వంతు కృషి చేస్తానని అన్నారు. అనంతరం ప్రిన్సిపాల్ రమేశ్లాల్ను పాఠశాల ఉపాధ్యాయులు సిబ్బంది ఘనంగా సన్మానించారు. ఈ సన్మాన కార్యక్రమంలో కోఆర్డినేటర్ జీవన్, ఉపాధ్యాయులు హరిప్ర సాద్, మురళి, వెంకట్, నాగేశ్వరరావు, భాష్యనాయక్, సుధ, ఉమ పాల్గొన్నారు.