Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సత్ఫలితాలను ఇచ్చిన సింగరేణి ప్రత్యేక శిక్షణ శిబిరాలు
నవతెలంగాణ-కొత్తగూడెం
సింగరేణి సంస్థ కోల్‌బెల్టు 10 ఏరియాల్లో ఆరు జిల్లాలోని యువతకు ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో ఆర్మిలో శిక్షణ నిర్వహించారు. ఫ్రీ ఆర్మీ రిక్రూట్మెంట్ శిబిరాలు మంచి ఫలితాలను ఇచ్చాయి. సికింద్రాబాద్‌కు సమీపంలోని హకీంపేటలో మార్చి 4 నుంచి 25వ తేదీ వరకు నిర్వహించిన ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీలో సింగరేణి ద్వారా శిక్షణ పొందిన యువకుల్లో 96 మంది శరీరదారుడ్య పరీక్షలో ఉత్తీర్ణులయ్యారు. అనంతరం జరిగిన మెడికల్ పరీక్షలో వీరి నుండి 73 మంది ఉత్తీర్ణులై ఫైనల్ రాత పరీక్షకు ఎంపికయ్యారు. దీనిపై సేవా సమితి ఉపాధ్యక్షులు, జనరల్ మేనేజర్ కో-ఆర్డినేషన్ కె.సూర్యనారాయణ, సేవా సమితి సింగరేణి వ్యాప్త చీఫ్ కో-ఆర్డినేటింగ్ ఆఫీసర్ మహేష్‌లు హర్షం వ్యక్తం చేశారు. ఎంపికైన 73 మందిలో జనరల్ డ్యూటీ సోల్జర్ విభాగానికి 41 మంది, ట్రేడ్స్ మెన్ విభాగానికి 27 మంది, నర్సింగ్, క్లర్కుల విభాగానికి ఐదుగురు ఎంపికయ్యారు. సింగరేణి సేవా సమితి ద్వారా 300 మందిని ఎంపిక చేసి భోజన వసతులు సమకూర్చి శిక్షణ ఇచ్చారు. ఫలితంగా గత ఏడాది జరిగిన ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీలో272 మంది యువకులు పాల్గొనగా వీరిలో శరీర దారుఢ్య పరీక్షల్లో162మంది ఉత్తీర్ణులు కాగా తదుపరి వైద్య పరీక్షల్లో 114 మంది పాసయ్యారు. ఆ తర్వాత జరిగిన రాతపరీక్షల్లో 35 మంది ఉద్యోగాలు సాధించారు.
సింగరేణి సంస్థ తమను సొంత బిడ్డలు చూసుకుని ఉచిత శిక్షణ సౌకర్యాలు కల్పించడం పట్ల వారు తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు.