Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఖమ్మం :పాతబస్టాండును కొనసాగించాలని, కేటీఆర్ పర్యటనను అడ్డుకుంటామని పాతబ స్టాండు పరిరక్షణ కమిటీ గురు వారం జరిగిన సమావేశంలో నిర్ణయిం చడంతో దానిని దృష్టిలో పెట్టుకుని పోలీసులు శుక్రవారం ఉదయం ముందస్తు అరెస్టులలో భాగంగా ఎస్ఎఫ్ఐ నాయకు లు అశోక్, తెలుగు యువత ఖమ్మం పార్లమెంట్ అధ్యక్షులు నల్లమల రంజిత్, తెలుగు యువత రాష్ట్ర ప్రధానకార్యదర్శి నున్నా నవీన్ , బిజేపీ నాయకులు ప్రతాప్ రుద్ర , యోగి, రామకృష్ణ, యూత్ కాంగ్రెస్ నాయకులు సంతోష్, ఎన్డ్ నాయకులు వంశీకృష్ణ, వివిధ సంఘాలకు చెందిన నాయకులను అరెస్టు చేసి పోలీస్ కమిషనర్ కార్యాలయానికి తరలించారు. కేటీఆర్ వెళ్ళిపోయిన తర్వాత అరెస్టు చేసిన నాయకులను విడుదల చేశారు.