Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఖమ్మం : జిల్లాలో పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయడానికి ఖమ్మం వచ్చిన ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్కు టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు వద్దిరాజు రవిచంద్ర (గాయత్రి రవి) స్వాగతం పలికారు. శుక్రవారం ఖమ్మం సర్దార్ పటేల్ స్టేడియంలోని హెలిప్యాడ్ వద్ద కేటీఆర్ ను కలిసి పుష్ప గుచ్ఛం అందించారు. కేటీఆర్ తో పాటు మంత్రులు అజరు కుమార్, వేముల ప్రశాంత్ రెడ్డిలకు కూడా గాయత్రి రవి స్వాగతం పలికారు.