Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఖమ్మంప్రాంతీయప్రతినిధి
తండ్రి మరణంతో బాధపడుతున్న టీఆర్ఎస్ నాయకులు వడ్డెబోయిన శ్రీనివాస్‌రావు, తాజా మాజీ కార్పొరేటర్ నర్సింహారావు, శంకర్రావు సోదరులను ఖమ్మం మాజీ ఎంపీ, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి శుక్రవారం పరామర్శించారు. వడ్డెబోయిన అప్పారావు చిత్రపటం వద్ద పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు. అప్పారావు ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్ధించారు. అప్పారావు మృతి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. వడ్డెబోయిన కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు.
ఖమ్మం రూరల్ మండలం లోని వెంకటగిరిలో జరిగిన గ్రామ టీఆర్ఎస్ అధ్యక్షులు మెండే వెంకటేష్ యాదవ్ కుమార్తె అన్న ప్రాసన కార్యక్రమంలో ఖమ్మం మాజీ ఎంపీ, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. చిన్నారికి ఆత్మీయ ఆశీర్వదాన్ని అందించారు.మాజీ ఎంపీ పొంగులేటి వెంట రాష్ట్ర మార్కెఫెడ్ వైస్ చైర్మన్ బొర్రా రాజశేఖర్, కొణిజర్ల ఎంపీపీ గోసు మధు, కొణిజర్ల మండల టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కోసూరి శ్రీను, కొప్పెర ఉపేందర్, బాణాల లక్ష్మణ్, దొడ్డా నగేష్, వరద నర్సింహారావు, దుంపల రవికుమార్, గుండెబోయిన నర్సింహారావు, చింతమల్ల గురుమూర్తి, బోడెపుడి రాజా, అజ్మీరా అశోక్ నాయక్, మద్ది కిశోర్‌రెడ్డి, జొన్నలగడ్డ రవితేజ, గోపి పాల్గొన్నారు.