Authorization
Mon Jan 19, 2015 06:51 pm
గాంధీచౌక్ : తెలంగాణ, ఏపీలకు అనుసంధానంగా నిత్యం వేలాది మంది ప్రయాణి కులకు నాలుగు దశాబ్దాలుగా సేవలందించిందిన బస్టాండ్‌కు వీడ్కోలు పలకనున్నారు. బైపాస్ రోడ్డులో శుక్రవారం కొత్త బస్టాండ్‌ను ప్రారంభించ నుండగా, శనివారం నుంచి పాత బస్టాండ్ మూతపడనుంది. జలగం వెంగళరావు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 1978 లో అప్పటి ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని ఖమ్మం మయూరి సెంటర్లో మూడు ఎకరాల స్థలంలో 12 ప్లాట్ ఫారాలతో బస్టాండ్ నిర్మించారు. ఏపీ, తెలంగాణ, ఛత్తీస్ గఢ్, ఒడిస్సా, కర్ణాటక తదితర రాష్ట్రాలకు సంబంధించి రోజుకు 1500 సర్వీసులు ఖమ్మం బస్టాండ్ నుంచి నడిచాయి. నిత్యం 40 వేల మందికిపైగా ప్రయాణికులు తమ గమ్యస్థానాలకు చేర్చిన ఈ బస్టాండ్ ఇక మూతపడనుంది. అయితే భవిష్యత్ లో ఈ బస్టాండ్ ను ఆర్టీసీ ఆధ్వర్యంలో కల్యాణ మండపంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు ప్రభుత్వం ప్రకటిస్తోంది.