Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సారపాక
ఉరేసుకుని యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన బూర్గంపాడు మండలం సారపాకలో శుక్రవారం చోటు చేసుకుంది. దీనికి సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. భద్రాచలం పట్టణానికి చెందిన పాముల రవితేజ (20) గాంధీనగర్లోని తన అమ్మమ్మ, తాతయ్య ఇంటి వద్ద ఉంటూ స్థానిక ఐటీసీ కర్మాగారంలో కాంట్రాక్టు కార్మికుడిగా పని చేస్తున్నాడు. ఈ క్రమంలో శుక్రవారం ఉరేసుకుని అత్మహత్యకు పాల్పడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. మృతుని తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.