Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-భద్రాచలం
భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామివారి దేవస్థానంలో బహుళ ఫాల్గుణ మాసోత్సవాల్లో భాగంగా శుక్రవారం సందర్భంగా రామయ్య తండ్రికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. బెంగుళూరు భక్తులు రూ.కోట్లతో తయారు చేయించి సమర్పించిన సర్వాంగ స్వర్ణ కవచాలను ధరింపజేశారు. ఈ కవచాలంకరణతో సీతారామ, లక్ష్మణ స్వామివారి మరింత రమణీయంగా భక్తులకు దర్శనమిచ్చారు. తెల్లవారుజామున 4.30గంటలకు ఆలయ తలుపులు తెరిచి రామయ్యకు సుప్రభాత సేవ, ఆరాధన. సేవా కాలం, నిత్య హౌమాదులు నిర్వహించారు. ఉదయం 8.30 గంటలకు శ్రీసీతా, రామ లక్ష్మణ ఉత్సవమూర్తులను ప్రత్యేక పల్ల కిలో బేడామండపానికి వేద మంత్రోచ్ఛరణలు, మేళతాళాలు, మం గళవాయిద్యాల నడుమ తోడ్కొని వచ్చారు. ముందుగా విశ్వక్సేన ఆరాధన, పుణ్యవచనం జరిపారు. అర్చకుల వేద మంత్రోచ్ఛరణల నడుమ నిత్య కల్యాణం కమనీయంగా జరిపించారు.