Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సారపాక
బూర్గంపాడు మండలం మోతే పట్టినగర్ వద్ద గోదావరిలో పెంపుడు శునకాన్ని కాపాడబోయి గల్లంతయిన ఇద్దరు యువకుల మృతదేహాలు శుక్రవారం లభ్యమయ్యాయి. గురువారం రాత్రి వరకు గాలింపు చర్యలు కొనసాగినా వీరి జాడ దొరకలేదు. తిరిగి శుక్రవారం ఉదయం గాలింపు చర్యలు ప్రారంభించారు. బోట్లు, గజ ఈతగాళ్ల సాయంతో గోదావరిలో వెతికారు. మొదట హరిచందు (24) మృతదేహం లభ్యమైంది. కొద్దిసేపటి అనంతరం షణ్ముఖరావు (21) మృతదేహం లభ్యమైంది. యువకుల మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం బూర్గంపాడు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోస్టుమార్టం అనంతరం కుటుంబసభ్యులకు అప్పగించారు. బాధిత కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఘటనాస్థలాన్ని జడ్పీటీసీ సభ్యురాలు కామిరెడ్డి శ్రీలత, సొసైటీ అధ్యక్షుడు బిక్కసాని శ్రీనివాసరావు, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జలగం జగదీశ్, సర్పంచ్లు సూరమ్మ, రామలక్ష్మి, లక్ష్మి పరిశీలించి, బాధిత కుటుంబసభ్యులతో మాట్లాడి ఘటన వివరాలు అడిగి తెలుసుకున్నారు. అన్ని విధాలుగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు.