Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దూలుగొండ తల్లిని దర్శించుకున్న మాజీ ఎమ్మెల్యే పాయం
నవతెలంగాణ-గుండాల
మండలంలోని రోళ్ళగడ్డ గ్రామంలో గత మూడు రోజులుగా జరిగిన ఈసం వంశీయుల ఇలవేల్పు దూలుగొండ తల్లి జాతర శుక్రవారంతో ముగిసింది. బుధవారం ప్రారంభమైన దూలుగొండ తల్లి జాతర శుక్రవారం భక్తుల మొక్కులందుకొని జనం నుండి వనంలోకి వెళ్లడంతో జాతర తంతు ముగిసింది. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై మొక్కులు చెల్లించుకున్నారు.
దూలుగొండ తల్లిని దర్శించుకున్న పినపాక మాజీ ఎమ్మెల్యే పాయం
గుండాల మండలంలోని రోళ్ళగడ్డ గ్రామంలో ఈసం వంశీయులు గత మూడు రోజులుగా అత్యంత వైభవంగా నిర్వవహించిన దూలుగొండ తల్లి అమ్మవారిని చివరి రోజైన శుక్రవారం పినపాక మాజీ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్ధ ప్రసాదాలు స్వీకరించారు. జాతర నిర్వహకులు పాయం వెంకటేశ్వర్లును శాలువాతో ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో ఈసం వంశీయులు కృష్ణ, నారాయణ రావు, నారాయణ, బుచ్చి రాములు, పాపారావు, సాంబ య్య, శంకర్, కన్నయ్య, రోళ్ళగడ్డ సర్పంచ్ అజ్మీరా మెహన్, తెల్లం భాస్కర్, ఖదీర్, దార అశోక్, నిట్ఠా రాములు, గడ్డం రమేష్, బొబ్బిలి శ్రావణ్, డాక్టర్ రాము, వీరునాయక్, భూక్యా శ్రీను, గుగులోత్ మోహన్, రాము నాయక్ తదితరులు పాల్గొన్నారు.
పెండ్లి ట్రాక్టర్ ప్రమాద బాధితులను పరామర్శించిన పాయం
మండలంలోని కన్నాయిగూడెం గ్రామానికి చెందిన కల్తి రామయ్య, సుగుణ దంపతుల కుమారుడు మహేష్ పెండ్లి వేడుకలో భాగంగా మామకన్ను దగ్గర ట్రాక్టర్ బోల్తా పడిన ఘటనలో గాయపడిన వారిని శుక్రవారం కన్నాయిగూడెం గ్రామంలోని వారి ఇంటికి వెళ్లి పరామర్శించారు. అనంతరం ఇప్పలగూడెం గ్రామంలో ఇటీవల మరణించిన ఈసం రామయ్య కుటుంబాన్ని పరామర్శించి వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.