Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విలేకర్ల సమావేశంలో ప్రోఫెసర్ కోదండరాం
నవతెలంగాణ-కొత్తగూడెం
నిరుద్యోగుల్లారా అమాయాకంగా ప్రాణాలు తీసుకోకండీ...పోరాడి ఉద్యోగాలు సాధించుకుం దామని తెలంగాణ జనసమితి నాయకులు ప్రొఫెసర్ కోదండరామ్ అన్నారు. శుక్రవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇటీవల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తనకు సహకరించిన పలు రాజకీయ పార్టీల నాయకులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. అనంతరం విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార పార్టీ, కొన్ని ప్రతిపక్ష పార్టీలు హంగు ఆర్భాటాలు చేసినప్పటికీ అనేక మంది నిరుద్యోగులు, ఉద్యోగులు లక్షకు పైగా ఓటు వేసి ఆదరించారన్నారు. నైతిక విజయం మనదేఅని తెలిపారు. అధికార పార్టీ చేసిన మాయాజాలంలో అనేక మంది నిరుద్యోగుల పడ్డారని తెలిపారు. గత 5 రోజుల క్రితం మహాబూ బాబాద్ జిల్లా, గూడూరు మండలం, రామ్‌సింగ్ తండాకు చెందిన నిరుద్యోగి బోడా సునీల్ నాయక్ కేసీఆర్ మోసపూరిత విధానాన్ని వ్యతిరేకిస్తు పురుగు మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డ విషయాన్ని ఉద్ఘాటిస్తు ఇదేనా బంగారు తెలంగాణ అని ప్రశ్నించారు. జిల్లాలో అనేక పరిశ్రమలు ఉన్నప్పటికీ స్థానికులకు ఉద్యోగ అవకాశాలు లేక ఆర్ధిక ఇబ్బందు లు ఎదుర్కోంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ విలేకర్ల సమావేశంలో ఎన్డీ జిల్లా కార్యదర్శి కెచ్చెల రంగారెడ్డి, ముద్దా భిక్షం, ఆవునూరి మధు, టిపిటి ఎఫ్ రాష్ట్ర నాయకులు రామాచారి, జిల్లా నాయకు లు ముత్తయ్య, ఆదివాసీ పరిషత్ నాయ కులు కామరావుజ తుడుందెబ్బ జిల్లా అధ్యక్షులు ఆలెం కోటి, టిజేఎస్ ప్రధాన కార్యదర్శి శివప్రసాద్, టిజేఎస్ రాష్ట్ర నాయకులు రామనాధం, శంకర్, దేవదానం, నభీ సాహెబ్, జనార్ధన్ రెడ్డి, కరుణా కర్‌రెడ్డి, సాయిబాబా తదితరులు పాల్గొన్నారు.